అందుకే ఆ ముగ్గురిని అంత బలంగా నమ్మారా?

సోషల్ ఇంజనీరింగ్ లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ను ముఖ్యమంత్రి జగన్ మించిపోయారనే టాక్ క్యాబినెట్ కూర్పు లో వినిపించింది. సామాజిక వర్గాల సమతూకం పాటించడమే [more]

Update: 2020-07-02 08:00 GMT

సోషల్ ఇంజనీరింగ్ లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ను ముఖ్యమంత్రి జగన్ మించిపోయారనే టాక్ క్యాబినెట్ కూర్పు లో వినిపించింది. సామాజిక వర్గాల సమతూకం పాటించడమే కాదు ఐదు కీలకమైన కులాలకు ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘనత వైఎస్ జగన్ అందుకున్నారు. అయితే ఇదంతా ప్రచార ఆర్భాటామని నాడు విపక్షం చేసిన ఆరోపణలు నిజం చేసేలా జగన్ వ్యవహారం తాజాగా చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ బాధ్యతలను తన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి కేటాయించడంతో వైసిపి అసలు రంగు బయటపడుతుందనే విమర్శలు ఎదుర్కొవాలిసి వస్తుంది.

జిల్లాల బాధ్యుల పై చర్చ …

పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ ముగ్గురు కీలక నేతలకు పని విభజన చేశారు. వీరిలో విజయసాయి రెడ్డి కి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు అప్పగించారు. తన బంధువు వైవి సుబ్బారెడ్డి కి ఉభయగోదావరి కృష్ణా, గుంటూరు జిల్లాలను ప్రసాదించారు. మరో నేత సజ్జల రామ కృష్ణారెడ్డి కి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం కర్నూలు బాధ్యతలను ఇచ్చారు. వీరు ముగ్గురు జగన్ కోటరీ లో అత్యంత కీలకమైన నేతలు. అయితే టిడిపి కి కమ్మ పార్టీ ముద్ర ఎలా ఉందో వైసిపి కి రెడ్డి పార్టీ ముద్ర ను పార్టీ లో ఈ ముగ్గురికి పెత్తనం అప్పగించి జగన్ వేసినట్లే అయ్యింది.

ఎలాంటి పరిస్థితుల్లో పార్టీ వీడరనేనా …?

ఈ ముగ్గురు ఎలాంటి పరిస్థితుల్లోనూ వైసిపిని విడిచిపెట్టారని జగన్ నమ్ముతారని అందుకే నియమించారని అధికారపార్టీలో టాక్ వినిపిస్తుంది. అయితే వైసిపి లో 2009 నుంచి జగన్ ను అంటిపెట్టుకుని నేటి వరకు పదవులు ఉన్నా లేకపోయినా అనుసరించే వారు చాలామంది కీలక నేతలు ఉన్నారు. వీరిలో వివిధ సామాజికవర్గాల వారు ఉన్నారు. అలాంటప్పుడు అధినేత వీరి ముగ్గురిపైనే విశ్వాసం ప్రకటించడం ఏమిటన్న చర్చ కూడా ఆ పార్టీలో ఉంది.

కోవర్టు ఆపరేషన్ నుంచి….

ఉత్తరాంధ్ర లో ఉన్న బలమైన సామాజిక వర్గాలకు అక్కడి బాధ్యతలను, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం నుంచి రాయలసీమ వరకు ఐదు భాగాలు చేసి క్యాబినెట్ కూర్పు తరహాలోనే అధినేత బాధ్యతలు అప్పగించి ఉంటె ప్రజల్లోకి మంచి సందేశం వెళ్లేది అని చర్చలు నడుస్తున్నాయి. అయితే రఘు రామకృష్ణం రాజు ఎపిసోడ్ తరువాత బిజెపి, టిడిపి లనుంచి ఎదురయ్యే కోవర్ట్ ఆపరేషన్ ల నుంచి ఈ ముగ్గురే పార్టీని కాపాడతారన్న నమ్మకంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నా వైఎస్ జగన్ తప్పటడుగు వేశారనే ఎక్కువమంది భావిస్తున్నారు.

Tags:    

Similar News