అందరూ సీనియర్లు.. విధేయులే…? మరి?

రాజ‌కీయాల్లో ఎన్నిసార్లు గెలిచామ‌న్నది ఒక భాగ‌మైతే.. ప్రభుత్వంలో మంత్రి అనిపించుకోవ‌డం అత్యంత ముఖ్యం. ఐదారుసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా మంత్రి కాలేద‌నే అసంతృప్తి ఉన్న వారిని మ‌నం [more]

Update: 2020-07-01 03:30 GMT

రాజ‌కీయాల్లో ఎన్నిసార్లు గెలిచామ‌న్నది ఒక భాగ‌మైతే.. ప్రభుత్వంలో మంత్రి అనిపించుకోవ‌డం అత్యంత ముఖ్యం. ఐదారుసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా మంత్రి కాలేద‌నే అసంతృప్తి ఉన్న వారిని మ‌నం చూస్తూనే ఉన్నాం. మంత్రి పీఠం కోసం నేత‌లు అంత‌గా త‌హ‌త‌హలాడిపోతారు. ఎన్ని ప‌ద‌వులు ఉన్నా.. మంత్రి ప‌ద‌వి సాటి మ‌రొక‌టిలేదు.. రాదు అని బాహాటంగానే చెప్పుకొంటారు. అందునా.. ఎన్నాళ్లో వేచిన ఉద‌యం అన్నట్టుగా ఏపీలోజ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఆయ‌న కేబినెట్‌లో మంత్రి అని అనిపించుకునేందుకు చాలా మంది ఎదురు చూశారు. ఇంకా… చూస్తున్నారు. అయితే, రెండున్నరేళ్ల త‌ర్వాతే మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పడంతో ఎవ‌రి మ‌టుకు వారు ఎదురు చూపుల్లోనే కాలం గ‌డుపుతున్నారు.

అదే జిల్లాకు ఇస్తారని….

అయితే, అనూహ్యంగా ఇప్పుడు రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లిసుభాష్ చంద్రబోస్‌లు రాజ్యస‌భ‌కు ప్రమోట్ కావ‌డంతో ఈ రెండు స్థానాలు త్వర‌లోనే భ‌ర్తీ చేయాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. వీటిలో మోపిదేవిది గుంటూరు జిల్లా. పైగా ఆయ‌న బీసీ నాయ‌కుడు. సో.. ఈయ‌న స్థానాన్ని మ‌ళ్లీ గుంటూరు నుంచే ఫిల‌ప్ చేస్తార‌ని వైసీపీలో చ‌ర్చించుకుం టున్నారు. దీంతో గుంటూరుకు చెందిన వైసీపీ నాయ‌కులు ఎవ‌రికి వారు జాత‌కాలు స‌రిచూసుకునే ప‌నిలో మునిగిపోయారు. ఉన్న‌ది ఒక్క సీటు.. కానీ, నేత‌లు మాత్రం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

అందరూ సీనియర్లే.. విధేయులే….

పోనీ.. ఒక‌రిద్దరు.. మంత్రుల‌ను అసంతృప్తి కోణంలో తీసిప‌క్కన‌పెట్టినా.. గుంటూరుకు కేవ‌లం ఒక‌టి మాత్రమే ప‌ద‌వి ద‌క్కుతుంది. అయినా.. జ‌గ‌న్ ఇలా.. రెండున్నరేళ్లు.. అన్న మాట నుంచి వెన‌క్కుత‌గ్గుతార‌ని భావించ‌లేం. సో.. ఇప్పుడు ఖాళీ అయిన రెండు మంత్రి పీఠాల‌నే ఆయ‌న త్వర‌లో భ‌ర్తీ చేస్తారు. ఇక‌, ఈ జాబితాలో ఉన్న నేత‌ల‌ను ప‌రిశీలిస్తే.. అంద‌రూ సీనియ‌ర్లు, పార్టీకి అత్యంత విధేయులే ఉన్నారు. వీరిలో ఒక్క‌రు త‌ప్ప మిగిలిన వారంతా .. పార్టీ ఆవిర్భావం నుంచి చ‌క్రం తిప్పుతున్నారు. జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నారు. క‌ష్టాలు, సుఖాల్లో పార్టీ వెంటే నిలిచారు. దీంతో ఎవ‌రికి మంత్రిపీఠం ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అస‌లు ఈ జిల్లా నుంచి ఖాళీ అయిన మంత్రి ప‌ద‌విని భ‌ర్తీ చేయ‌డం జ‌గ‌న్‌కు సైతం పెద్ద చిక్కుముడి మాదిరిగానే ఉంది.

పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి: వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. మాచ‌ర్ల నుంచి వ‌రుస విజ‌యాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఆయ‌న ఓట‌మి లేకుండా నాలుగు సార్లు గెలిచారు. ఈయ‌న ‌మంత్రి పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. ప్రస్తుతం విప్‌గా ఉన్నారు. అయితే, బీసీ నాయ‌కుడు ఖాళీ చేస్తున్న పీఠాన్ని రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుడితో భ‌ర్తీ చేస్తారా? అనేది సందేహం. ఇలా చేస్తే.. బీసీల‌కు త‌గ్గించార‌నే ప్రతిప‌క్షాల విమ‌ర్శలు ఎదుర్కొనాలి. ఈ విష‌యం జ‌గ‌న్‌కు కొంత ఇబ్బంది క‌ర‌మే.

ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి: వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడు. మంగ‌ళ‌గిరి నుంచి టీడీపీ అధినేత కుమారుడు లోకేష్‌పై సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఈయ‌నకు ‌మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌నే స్వయంగా ప్రక‌టించారు. అయితే, ఇక్కడ కూడా బీసీ నాయ‌కుడు ఖాళీ చేస్తున్న పీఠాన్ని రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుడితో భ‌ర్తీ చేస్తారా? అనేది సందేహం. ఈయ‌న వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

మ‌ర్రి రాజ‌శేఖర్‌: క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. గత ఏడాది ఎన్నిక‌ల్లో త‌న చిల‌క‌లూరిపేట‌ సీటును త్యాగం చేశారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు జ‌గ‌న్ మంత్రిగా అవ‌కాశం ఇస్తాన‌ని ప్రక‌టించారు. కానీ, ఈయ‌న‌ను ముందుగా ఎమ్మెల్సీ ని చేయాలి. కానీ, ఇది కూడా సాధ్యం కాదు. సో.. ఈయ‌న ఆశ‌లు కూడా ఇప్పట్లోతీరేలా క‌నిపించ‌డం లేదు.

అంబ‌టి రాంబాబు: కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. కీల‌క‌మైన స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ స్పీక‌ర్ కోడెల‌ను ఓడించారు. పార్టీకి మంచి మౌత్‌పీస్ గా ఉన్నారు. క‌ష్టాలు , సుఖాల్లో పార్టీ వెంటే న‌డుస్తున్నారు. ఈయ‌న కూడా మంత్రి ప‌ద‌విని ఆశిస్తున్నారు. అయితే, ఇప్పటికే కాపు వ‌ర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. సో.. బీసీ నేత వెళ్లిపోవ‌డంతో ఖాళీ అయ్యే సీటును ఈయ‌న‌కు ఇస్తారా? అనేది వేచి చూడాలి.

విడ‌ద‌ల ర‌జ‌నీ: ఈమె బీసీ వ‌ర్గానికి చెందిన నాయకురాలు. ఫైర్ బ్రాండ్ కూడా. ఈమె ఈ బీసీ నాయ‌కుడు ఖాళీ చేయ‌డంతో వ‌చ్చిన మంత్రి స్థానం త‌న‌కే ద‌క్కుతుంద‌ని అనుకుంటున్నారు. పైగా గుంటూరు జిల్లాలో బీసీ నేత‌లు ఎవ‌రూ లేరు. అయితే, ఈమె ఫుల్లుగా జూనియ‌ర్ కావ‌డం పెద్ద మైన‌స్ అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌లకు కొద్ది నెల‌ల ముందు మాత్రమే ఆమె పార్టీలోకి వ‌చ్చారు. పైగా ఈ జిల్లాలో ఇప్పటికే మేక‌తోటి సుచ‌రిత మ‌హిళా మంత్రిగా చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రి ఈమెకు అవ‌కాశం ద‌క్కుతుందా? అనేది సందేహం? ఏదేమైనా.. ఖాళీ అవుతున్న మంత్రి పీఠాల‌ను భ‌ర్తీ చేయ‌డం జ‌గ‌న్‌కు పెను స‌వాలే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News