జ‌గ‌న్ వ్యూహం.. క‌క్కలేక‌.. మింగ‌లేక‌.. టీడీపీ త‌ల‌కింద‌ులు

రాజ‌కీయాల్లో వ్యూహం ఏ ఒక్క‌రి సొంత‌మోకాదు! త‌ల‌ద‌న్నేవాడుంటే.. వాడి తానిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. అలాగే.. ఏపీ రాజ‌కీయాల్లోనూ అధికార పార్టీ వేస్తున్న వ్యూహాల‌తో ప్రతిప‌క్షం టీడీపీ ఉక్కిరిబిక్కిరి [more]

Update: 2020-06-30 14:30 GMT

రాజ‌కీయాల్లో వ్యూహం ఏ ఒక్క‌రి సొంత‌మోకాదు! త‌ల‌ద‌న్నేవాడుంటే.. వాడి తానిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. అలాగే.. ఏపీ రాజ‌కీయాల్లోనూ అధికార పార్టీ వేస్తున్న వ్యూహాల‌తో ప్రతిప‌క్షం టీడీపీ ఉక్కిరిబిక్కిరి ఫీల‌వుతోంది. ప్రస్తుతం శాస‌న మండ‌లి విష‌యాన్ని తీసుకుంటే.. చంద్రబాబు ఆయ‌న ప‌రివారం.. జ‌గ‌న్ ప్రభుత్వంపై దూకుడు పెంచాల‌ని అనుకున్నారు. మండ‌లిని ర‌ద్దు చేయ‌మ‌న్నదీ మీరే.. ఇప్పుడు ఒక్క మండ‌లి స్థానానికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌బెడుతున్నదీ మీరే! ఇదేనా మీ నీతి ? అంటూ.. టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌వాడ టీడీపీ న‌గ‌ర అధ్యక్షుడు బుద్ధా వెంక‌న్న స‌హా.. మిగిలిన నాయ‌కులు ప్రశ్నించారు.

రద్దు చేయమని కోరినా…..

నిజానికి మండ‌లిని ర‌ద్దు చేయ‌మ‌ని కోరింది జ‌గ‌నే. జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజ‌ధానుల బిల్లు, వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లు విష‌యంలో అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మండ‌లిలో టీడీపీ అడ్డుకుంది. నిజానికి అడ్డుకోవ‌డం అనేది మండ‌లిలో స‌భ్యుల‌కు ఉన్న హ‌క్కు దీనిని జ‌గ‌న్ స‌హా ఎవ‌రూ కాద‌న‌లేదు. కానీ, ఈ బిల్లుల‌పై టీడీపీ చేసిన రాజ‌కీయ‌మే ప్రధానంగా చ‌ర్చకు వ‌చ్చిన అంశం. ఈ నేప‌థ్యంలోనే ప్రజ‌ల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తుంద‌ని భావించిన మండ‌లి ఇలా వ్యవ‌హ‌రించే స‌రికి.. జ‌గ‌న్ ఏకంగా మండ‌లి ర‌ద్దును ప్రతిపాదిస్తూ.. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు.

పోటీకి నిలబెట్టడంపై….

ప్రస్తుతం ఈ బిల్లు.. కేంద్ర హోంశాఖ‌కు చేరింది. అయితే, దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ లోగా.. టీడీపీ ఎమ్మెల్సీ స‌భ్యుడు డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకున్నారు. పార్టికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఆయ‌న ఏకంగా రాజ‌కీయాల‌కు దూరం అవుతార‌ని అంద‌రూ అనుకున్నా.. వ్యూహాత్మకంగా ఆయ‌న వైసీపీలోకి చేరిపోయారు. ఇలా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి తాజాగా ఎన్నిక‌లు నిర్వహించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. దీంతో మ‌రోసారి టీడీపీ త‌న రాజకీయాల‌ను తెర‌మీదికి తెచ్చింది. మండ‌లిని ర‌ద్దు చేసిన వైసీపీ పోటీ కి ఎవ‌రినైనా ఎలా నిల‌బెడుతుంద‌ని టీడీపీ నేత‌లు యాగీ చేశారు.

వ్యూహాత్మకంగానే….

అయితే, జ‌గ‌న్ వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. రెండు రూపాల్లో టీడీపీకి చెక్ పెట్టేలా అడుగు వేశారు. ఏ సీటునైతే.. వ‌దులుకు వైసీపీలోకి చేరారో.. డొక్కాకు అదే సీటు ఇచ్చారు జ‌గ‌న్‌. దీంతో నిన్న మొన్నటి వ‌ర‌‌కు త‌మ‌కు అత్యంత విధేయుడైన డొక్కాపై విమ‌ర్శలు చేసే సాహ‌సం టీడీపీ చేయ‌లేదు. అదే స‌మయంలో ఎస్సీ వ‌ర్గానికి చెందిన డొక్కా ఖాళీ చేసిన‌ సీటును వేరేవారికి ఇచ్చి ఉంటే.. టీడీపీ రెచ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని భావించిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తిరిగి అదే ఎస్సీ వ‌ర్గానికి చెందిన డొక్కాకే ఇచ్చేశారు. దీంతో నిన్న మొన్నటి వ‌ర‌కు లేచిన టీడీపీ గొంతులు ఇప్పుడు ఏ ఒక్కటీ క‌నిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. జ‌గ‌న్ వ్యూహాత్మకంగా టీడీపీని క‌ట్టడి చేశార‌ని అంటున్నారు.

Tags:    

Similar News