జ‌గ‌న్ డైరీలో ఆ ఒక్కటే మిగిలిందా? త‌్వర‌లోనే అదీ పూర్తి

వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నది చేస్తార‌నే మాట నిల‌బెట్టుకుంటున్నారు. తాను అధికారంలోకి వ‌స్తే..మద్య నిషేధాన్ని విడ‌త‌ల వారీగా అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. చేస్తున్నారు. అదే స‌మ‌యంలో నాడు-నేడు [more]

Update: 2020-06-25 14:30 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్నది చేస్తార‌నే మాట నిల‌బెట్టుకుంటున్నారు. తాను అధికారంలోకి వ‌స్తే..మద్య నిషేధాన్ని విడ‌త‌ల వారీగా అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. చేస్తున్నారు. అదే స‌మ‌యంలో నాడు-నేడు ద్వారా పాఠ‌శాల‌ల ద‌శ దిశ మారుస్తాన‌ని హామీ ఇచ్చారు. చెప్పిన‌ట్టే చేస్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాల్లోనూ ఆయ‌న త‌న బాణిని ముందుకు దూకుడుగా తీసుకు వెళ్తున్నారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన ప్రజాప్రతినిధుల జంపింగుల విష‌యంలోనూ తాను అనుకున్నది అనుకున్నట్టు చేస్తున్నారు. ఎవ‌రైనా త‌న పార్టీలోకి రావాలంటే.. వారి పార్టీ ద్వారా సంక్రమించిన ప‌ద‌వుల‌ను వ‌దులుకుని రావాల‌ని చెప్పారు. అలా ఆయ‌న చెప్పిన‌ట్టే పార్టీలు వ‌దులుకుని వ‌చ్చేవారిని స్వాగ‌తిస్తున్నారు.

పార్టీలోకి రావాలంటే…?

అయితే, కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ ప్రభుత్వానికి మ‌ద్దతు ప్రక‌టించారు. కానీ, పార్టీని వ‌దులుకుని, త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రావ‌డం ఇష్టం లేక అక్కడే కొన‌సాగుతున్నారు. ఇలా ఏ విష‌యాన్ని తీసుకున్నా.. జ‌గ‌న్ తాను ఎన్నికల స‌మ‌యంలో ప్రజ‌ల‌కు ఎలాంటి హామీల‌ను ఇచ్చారో.. వాటిని తూచ త‌ప్పకుండా చేసేస్తున్నారు. అయితే, అధికారం లోకి వచ్చిన త‌ర్వాత తొలి అసెంబ్లీ స‌మావేశాల్లో స‌భ‌లోని 175 మంది (సీఎం, స్పీక‌ర్‌తో స‌హా)కి జ‌గ‌న్ ఒక హామీ ని ఇచ్చారు. ఆ ఒక్క హామీ మాత్రమే ఇప్పటి వ‌ర‌కు పెండింగ్‌లో ఉండిపోయింది. స‌ద‌రు హామీ తీర్చాల‌ని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇటీవల కాలంలో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు దీనిపైనా జ‌గ‌న్ దృష్టి పెట్టార‌ని అంటున్నారు.

ఎమ్మెల్యేకు కోటి…..

కేంద్ర ప్రభుత్వంలో పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో పార్లమెంటు స‌భ్యుల‌కు ఒక వినూత్న ప‌థ‌కాన్ని తెర‌మీదికి తెచ్చారు. ప్రతి ఎంపీకీ ఏటా 5 కోట్ల రూపాయ‌లు ఇచ్చే ఈ ప‌థ‌కం.. ప్రారంభించారు. దీని ప్రకారం ఎంపీ లాడ్స్ అనే ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే.. ప్రభుత్వాలు మారినా.. ఈ ప‌థ‌కం అమ‌లు అవుతూనే ఉంది. ఇదే త‌ర‌హాలో ఏపీలోని ఎమ్మెల్యేల‌కు కూడా ఒక వినూత్న ప‌థ‌కాన్ని చిర‌స్థాయిగా అమ‌లు చేసేలా జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అదే.. ఏటా ఎమ్మెల్యేల‌కు పార్టీల‌తో నిమిత్తం లేకుండా రూ.కోటి ఇవ్వాల‌ని జ‌గ‌న్ సంక‌ల్పించారు. ఈ కోటి రూపాయ‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టాల్సి ఉంటుంది. ఇది ఏటా అమ‌లు చేసే కార్యక్రమంగా కూడా ఆయ‌న అప్పట్లోనే ప్ర‌క‌టించారు.

ఇది చేస్తే….

అయితే, జగన్ తొలి ఏడాది పాల‌న ముగిసిన‌ప్పటికీ.. ఇప్పటికీ ఇది అమ‌లు చేయ‌లేదు. అయితే, దీనికి సంబంధించిన విధి విధానాలు పూర్తయ్యాయ‌ని, త్వర‌లోనే దీనిని ప్రక‌టించ‌నున్నార‌ని సీఎంవో వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ప‌థ‌కంలోని విధానాల ప్రకారం మొత్తం సీఎం, స్పీక‌ర్ , ప్రతిప‌క్ష నాయ‌కుడు స‌హా 175 మంది ఎమ్మెల్యేల‌కు ఏటా కోటి రూపాయ‌ల నిధుల‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించ‌నుంది. ఇది అందితే.. త‌మ‌కు స్వతంత్రంగా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని స‌భ్యులు భావిస్తున్నారు. దీనిపై త్వర‌లోనే ప్రక‌టించే అవ‌కాశం ఉంది. ఈ ఒక్కటి కూడా చేసేస్తే.. జ‌గ‌న్‌పై ఉన్న భారం త‌గ్గిన‌ట్టేన‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

Tags:    

Similar News