జగన్ ఫెయిల్ అవుతారట ?

ఇదేం రాజకీయంలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఫెయిల్ అవాలని అపోజిషన్ పార్టీ కోరుకుంటుంది. నిజానికి సక్సెస్ అయితే వచ్చే ఫలాలు ప్రజలకే కదా. అంటే తమ రాజకీయం [more]

Update: 2020-06-25 05:00 GMT

ఇదేం రాజకీయంలో అధికారంలోకి వచ్చిన నాయకుడు ఫెయిల్ అవాలని అపోజిషన్ పార్టీ కోరుకుంటుంది. నిజానికి సక్సెస్ అయితే వచ్చే ఫలాలు ప్రజలకే కదా. అంటే తమ రాజకీయం ముందు ప్రజలు కూడా కనిపించరన్నమాట. ప్రజలు ఎలా పోయినా ఫరవాలేదు కానీ ముందు అధికారంలో ఉన్నవారు అన్నింటా చేతులెత్తేయాలి. ఈ రకమైన రాజకీయం బుర్రల్లో ఉండబట్టే చట్టసభలు చట్టుబండలు అయిపోతున్నాయి. ఆఖరులు ఉద్యోగులకు జీతాలకు, సాదా ఖర్చులకు రూపాయి కూడా ఖజానా నుంచి తీసుకోవడానికి వీలులేకుండా ద్రవ్య వినిమయ బిల్లుని పెద్దల సభలో పెద్ద మనుషులు ఆపేశారంటేనే రాజకీయం రంగేంటో. రుచి ఏమిటో తెలుస్తోంది.

బొక్క బోర్లా అట……

జగన్ తొలి ఏడాది ఎలాగో అప్పులు సప్పులు చేసి నవరత్నాలు హామీలు నిలబెట్టుకున్నారని, రెండవ ఏడాది ఆయన పప్పులు ఉడకవని పసుపు పార్టీ తమ్ముళ్లు అపుడే జోస్యాలు చెబుతున్నారు. మరో వైపు జేసీ దివాకరరెడ్డి లాంటి వారు పిల్లి శాపాలే పెడుతున్నారు. జగన్ ఎంత కష్టపడినా కిందా మీద పడినా కూడా కూడా నవరత్నాల హామీలను ఒక్కటీ నెరవేర్చలేరని అంటున్నారు. జగన్ హడావుడి అంతా రెండేళ్లకే పరిమితమ‌ట. ఆ తరువాత ఏమీ చేయలేక చేతులెత్తేస్తారని జేసీ కసిగా జగన్ జాతకం చెబుతున్నారు. అవును మరి జేసీ వాళ్ల తమ్ముడిని, కొడుకుని జైల్లో పెట్టిన మండిపాటు అదంటున్నారు.

నిజమేనా…?

అయితే విపక్షం అందని కాదు కానీ ఏపీ ఖజానా తీరు కూడా అలాగే ఉంది. దానికి కారణం గత ప్రభుత్వం అప్పులు కుప్ప చేసి ఎక్కడా కొత్త అప్పు పుట్టకుండా చేయడం ఒకటైతే టీడీపీ అతి తెలివికి జడిసిన బీజేపీ సర్కార్ కి ఇపుడు కొత్త కోడలిగా జగన్ దొరికేశారు. దాంతో పైసా కేంద్రం నుంచి ఇవ్వాలంటే లక్ష ప్రశ్నలు వేస్తున్నారు. దాంతో పైసా రావాలంటే బహు కష్టమైపోతోంది. ఆంతే కాకుండా ఏపీలో బీజేపీ ఎదుగుదామనుకుంటోంది. దాంతో రాజకీయం కూడా పనిచేస్తోంది. దాంతో ఆర్ధిక ఇబ్బందులు అలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

కరోనాతో కధ అంతే …?

వీటిని మించి ఇపుడు కరోనా మహమ్మారి మీదకు వచ్చేసింది. డబ్బున్న రాష్ట్రాలే కుదేల్ అయిపోతున్నాయి. దాంతో ఏపీ లాంటి అప్పుల రాష్ట్రాలు ఇపుడు నేల చూపులు చూడడమే. కేంద్రంలోని మోడీ సర్కారే అనేక స్కీములను అమలు చేయలేక మధ్యలోనే ఆపేసుకుంది. జగన్ కూడా మరీ చేతికి ఎముకలేనట్లుగా ఎక్కడ లేని డబ్బు తెచ్చి కుమ్మరిస్తున్నారు. కానీ ఇకమీదట అలా చేయడానికి కుదరకపోవచ్చునని అంటున్నారు. మొత్తానికి తొలి గండం గట్టెక్కిన జగన్ కి మలివిడతలో ఎన్నో మలుపులు, ప్రమాదాలు ఉన్నాయని అంటున్నారు. ఇక వాటిని జగన్ దాటాలనుకునా పెద్ద పాము నోట్లో జగన్ పడాలన్నదే ప్రతిపక్ష తెలుగుదేశం కోరిక. మరి జగన్ ఏపీ రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెనలు ఎక్కుతాడా. పాములు కరిచేస్తాయా. చూడాల్సిందే.

Tags:    

Similar News