రేసులో వీరేనట

వైసీపీలో మళ్లీ పదవుల కోసం రేస్ ప్రారంభమయింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంత్రి వర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు విన్పిస్తున్నాయి. జగన్ కేవలం రెండు [more]

Update: 2020-06-24 13:30 GMT

వైసీపీలో మళ్లీ పదవుల కోసం రేస్ ప్రారంభమయింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంత్రి వర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు విన్పిస్తున్నాయి. జగన్ కేవలం రెండు మంత్రి వర్గ స్థానాలకే పరిమితమవుతారా? లేక మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేస్తారా? అన్న చర్చ జరుుగుతుంది. అయితే కొన్ని కీలక శాఖల్లో మార్పులు జరిగే అవకాశముందని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రుల పనితీరుపై…..

ఇప్పటికే కొందరు మంత్రుల పనితీరుపై జగన్ అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. వారు శాఖలపై పట్టు సాధించకపోగా, అనవసర వివాదాల్లో తలదూరుస్తుండటం జగన్ కు తలనొప్పిగా మారింది. దీంతో కొందరు మంత్రులను ఆ యా శాఖల నుంచి తప్పించాలని కూడా జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇద్దరూ బీసీ సామాజికవర్గం వారే…..

దీంతో వైసీపీలో మంత్రి వర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాజ్యసభకు ఎన్నికయిన ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన వారిని జగన్ ఎంపిక చేస్తారంటున్నారు. అయినా పట్టు వీడని ఆశావహులు తమకు స్థానం దక్కుతుందని సీనియర్ నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. జగన్ కు ఈసారైనా నచ్చ చెప్పాలని కొందరు సీనియర్ నేతలపై వత్తిడి తీసుకువస్తున్నారు.

ప్రచారంలో వీరి పేర్లు…..

అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో జోగి రమేష్ కు జగన్ మంత్రి పదవి ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. అలాగే మోపిదేవి వెంకటరమణ సామాజిక వర్గానికిచెందిన పొన్నాడ సతీష్ పేరు కూడా బలంగా విన్పిస్తుంది. ఈయన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు కావడంతో ఇబ్బందులు ఉండవంటున్నారు. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణపై వైసీపీలో జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Tags:    

Similar News