రాజు గారితో పాటు ఆయనకు కూడా?

జగన్ తను అనుకున్నట్లుగా ముందుకు వెళుతున్నారు. తాను ఇచ్చిన హామీలపైనే జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. మరే విషయాన్ని జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తొలుత డోర్ టు డోర్ [more]

Update: 2020-06-21 12:30 GMT

జగన్ తను అనుకున్నట్లుగా ముందుకు వెళుతున్నారు. తాను ఇచ్చిన హామీలపైనే జగన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. మరే విషయాన్ని జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తొలుత డోర్ టు డోర్ సంక్షేమ పథకాలను తీసుకెళ్లే పనిలోనే గత ఏడాదిగా జగన్ ఉన్నారు. అంతే తప్ప ఇతర విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఏదైనా అత్యవసర విషయాలు తప్పించి పూర్తిగా జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు.

పూర్తిగా సంక్షేమ పథకాలపైనే…..

ఏడాది నుంచి రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నది వాస్తవం. కనీసం రోడ్డు వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేదు. ఇక ఎమ్మెల్యేలకు ఇస్తామన్న కోటి రూపాయల నిధులను కూడా ఇవ్వలేదు. దీనికి కారణం గత కొద్ది నెలలుగా కరోనా వైరస్ విజృంభించడమే. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. అప్పులు చేయక తప్పుదు. ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించాల్సి వచ్చింది. జగన్ కరోనా సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలను విస్మరించలేదు.

పార్టీని పూర్తిగా……

ఈ పరిస్థితుల్లో పార్టీని పూర్తిగా జగన్ వదలేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను కలిసేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడలేదు. అంత సమయమూ లేదంటున్నారు. ఇదే పరిస్థితి ఏడాదిగా పార్టీలో ఉంది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు సయితం పెద్దగా పార్టీని పట్టించుకోలేదు. దీంతో పార్టీలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. దాదాపు 70 నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తలెత్తాయి. కొందరు నేతలు పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నారు.

ఆ ఇద్దరికి షోకాజ్ నోటీసులు….

ఇటీవల కాలంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు తో పాటు కొందరు ఎమ్మెల్యేలు సయితం పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నారు. ప్రధానంగా ఇద్దరిపై చర్య తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇప్పటికి అనేక సార్లు విమర్శలకు దిగారు. దీంతో తొలుత వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని జగన్ పార్టీ సీనియర్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. కేవలం ఒక సామాజికవర్గం వారిపైనే చర్యలు తీసుకున్నారన్న అప్రదిష్ట రాకుండా ఆనం రామనారాయణరెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.

Tags:    

Similar News