ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ అవుతున్నారా?

తెలుగుదేశం సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని ఓ వైపు ఎంత ఘనంగా చెప్పుకుంటూంటే మరో వైపు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అన్న సౌండ్ కూడా వస్తోంది. [more]

Update: 2020-06-21 11:00 GMT

తెలుగుదేశం సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ అని ఓ వైపు ఎంత ఘనంగా చెప్పుకుంటూంటే మరో వైపు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అన్న సౌండ్ కూడా వస్తోంది. ఎన్టీఆర్ హయాంలో పాతికేళ్ల యువకులుగా చేరిన వారంతా ఇపుడు షష్టి పూర్తి బ్యాచ్ గా మారిపోయారు. చంద్రబాబే డెబ్బయి ఏళ్ళు దాటి ఉన్నారు. ఇక జిల్లాల్లో పసుపు నేతలు అంతా అలాగే ఉన్నారు. ఓ వైపు యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉంటే అవతల సైడ్ మాత్రం సీనియర్ నేతలతోనే టీడీపీ బరువుగానే పావులు కదుపుతోంది. ఇది ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ కావడంలేదని అదే పార్టీలో అంటున్నారు.

యూత్ టీం….

జగన్ తన మంత్రి వర్గం తీసుకున్నా కూడా యువతకు పెద్ద పీట వేస్తున్నారు. ఆయన మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని ఇలా చాలా మంది యాభై లోపు వయసు వారు ఇంకా చిన్న వాళ్ళు కనిపిస్తారు. అనుభవం కోసం తొలిసారి అధికారం కాబట్టి కొందరు సీనియర్లను జగన్ తీసుకున్నా ఆయన నమ్మేది, ఎక్కువగా ప్రోత్సహించేది మాత్రం యువ మంత్రులనే. ఇక మహిళ మంత్రులంతా కూడా చిన్న వయసు వారే ఉండడం విశేషం. రాబోయే రోజుల్లో కూడా జగన్ ఇదే కొలమానంతో ముందుకువెళ్లాలనుకుంటున్నారు. దీని వల్ల తన మాట వినే వారు ఉంటారు, జనాలకు కూడా తొందరగా కనెక్ట్ అవుతారు అన్నది జగన్ ఆలోచన.

వారికే పెద్ద పీట….

ఇక జిల్లాల్లోనూ జగన్ యువ నేతలకే పెద్ద పీట వేస్తున్నారు. విశాఖ జిల్లా తీసుకుంటే భవిష్యత్తులో కీలక నేతగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ని జగన్ గుర్తించి తీర్చిదిద్దుతున్నారు. 2024 తరువాత రాజకీయం అంతా ఆయన్ని ముందుంచి నడిపించాలనుకుంటున్నారు. అదే విధంగా యువ ఎమ్మెల్యేలుగా అదీప్ రాజ్, పెట్ల ఉమా శంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ, కె భాగ్యలక్ష్మి వంటి వారినే జగన్ ముందుండి నడిపించాలనుకుంటున్నారు. విజయనగరంలోనూ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో పాటు చాలా మంది యువ ఎమెల్యేలు వైసీపీలో ఉన్నారు. ఇక శ్రీకాకుళంలో చూస్తే ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడిపోయినా కూడా బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఆయనకే మంచి పదవులు ఇచ్చి జిల్లాలో గట్టి నేతగా నిలబెట్టాలనుకుంటున్నారు. అలాగే మరో యువ నేత‌ పేరాడ తిలక్, పలాసా ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వంటి వారు జగన్ యుత్ టీంలో ఉన్నారు.

కొత్తదనమేదీ…?

ఇక ఇదే టీడీపీలో తీసుకుంటే అంతా ఏజ్ బార్ నాయకులే ఉంటున్నారు. అయ్యన్నపాత్రుడు లాంటి నాయకులతోనే ఇంకా విశాఖ జిల్లా రాజకీయాన్ని నడిపించాలని బాబు చూస్తున్నారు. ఆయన వయోభారంతో నోరు చేసుకుంటూ బాలన్స్ తప్పేస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. ఇక మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, పప్పల చలపతిరావు వంటి వారే ఇపుడు టీడీపీలో సీనియర్ సిటిజన్లుగా మిగిలారు. ఇదే తీరు శ్రీకాకుళం, విజయనగరంలోనూ ఉంది. అక్కడ పూసపాటి రాజుల మీదనే టీడీపీ ఆధారపడితే వైసీపీ కొత్త నాయకత్వాన్ని తయారుచేస్తోంది. మొత్తానికి టీడీపీకి పూర్తి స్థాయిలో కాయకల్ప చికిత్స చేయాలని గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News