రైట్ టైంలో ఆపరేషన్ ?

ఆపరేషన్ చేయాల్సిన టైంలో చేస్తేనే రిజల్ట్ కరెక్ట్ గా వస్తుంది. పాలిటిక్స్ లో రైట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. పదేళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న జగన్ [more]

Update: 2020-06-13 06:30 GMT

ఆపరేషన్ చేయాల్సిన టైంలో చేస్తేనే రిజల్ట్ కరెక్ట్ గా వస్తుంది. పాలిటిక్స్ లో రైట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. పదేళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న జగన్ అందుకే సరైన టైం చూసుకుని మరీ ఆపరేషన్ స్టార్ట్ అన్నాడు. టీడీపీ ఈ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తెలుగుదేశం పార్టీకి ఇపుడు దారుణమైన పరిస్థితి ఉంది. ఏడాది అయినా కోలుకోలేదు. మరో రెండేళ్ళు టైం ఇస్తే ఏమో మళ్ళీ పుంజుకుటుందేమో. అందుకే అంత టైం ఇవ్వనంటున్నాడు జగన్. ఆయన చేతిలో అధికారం ఉంది. బంపర్ మెజారిటీ ఉంది. తాను ఏమనుకుంటే అది చేయగలిగే సీన్ ఇపుడు ఉంది. అందుకే పసుపు పార్టీకి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు.

టెర్రరేనా…?

తెలుగుదేశం పార్టీకి ఏడాదిగా వైసీపీ నుంచి ఇబ్బందుకు ఎదురవుతున్నాయి. ఢీ అంటే ఢీ అంటున్న రెండు పార్టీలు గ్రామ స్థాయి వరకూ నిలిచి ఉన్నపుడు ఆ పరిస్థితి తప్పదు. అయితే అధికారంలో ఉన్న పార్టీదే ఆ టైంలో కూడా పై చేయి అవుతుంది. ఎందుకంటే పోలీసులు వారి చేతిలో ఉంటారు కాబట్టి. అయితే ఇపుడు ఆ ఇబ్బందులు క్యాడర్ని దాటి ద్వితీయ శ్రేణి లీడర్ని దాటి మరీ ఏకంగా చంద్రబాబు పక్కకే వచ్చేశాయి. అంటే ఒక విధంగా టీడీపీకి అసలైన టెర్రర్ ఏంటో చూపించడానికే ఈ ఆపరేషన్ అంటున్నారు.

సరెండరే మరి….

ఏకంగా టాప్ రేంజ్ లీడర్లనే టచ్ చేసినపుడు మొత్తానికి మొత్తం టీడీపీ బలం కాస్తా భయంగా మారుతుంది. టోటల్ గా రాష్ట్రంలో మరో నాయకుడు గట్టిగా గొంతు ఎత్తడానికి కూడా వణుకే పుడుతుంది. ఇపుడు అదే జరుగుతోంది. ఏపీలో టీడీపీ టాప్ రేంజి లీడర్ల మీద టార్గెట్ జరుగుతోంది. ఇదంతా వ్యూహం ప్రకారమే జరగడంతో టీడీపీ సవాల్ చేసే స్థితి నుంచి సరెండర్ అయ్యే పరిస్థితికి వస్తోంది. నిజానికి ఓడిన తరువాత నుంచి టీడీపీ తరఫున బలంగా గొంతులు లేచిన సందర్బాలు తక్కువ. చాలా మంది నాయకులు తెరచాటుకు వెళ్ళిపోయారు. ఉన్నంతలో కొద్ది మంది మాత్రమే నోళ్ళు తెరుస్తున్నారు. దీంతో మొత్తం అపోజిషన్ ని కట్టడి చేయాలంటే పవర్ ఫుల్ ఆపరేషన్ అవసరం. అచ్చెన్నాయుడు అరెస్ట్ ను అందులో భాగంగా చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

డిఫెన్స్ లోనే…..

ఇంతవరకూ కధ వచ్చిన తరువాత టీడీపీ నైతిక స్థైర్యం మొత్తం దెబ్బతింటుంది. అచ్చెన్నాయుడు లాంటి లీడర్ కే అలా జరిగితే మన సంగతేంటన్న చర్చ కూడా తమ్ముళ్ళలో వస్తుంది. దాంతో టీడీపీ కంప్లీట్ గా డిఫెన్స్ లో పడుతుంది. అపుడు వార్ వన్ సైడ్ అవుతుంది. సరిగా ఇదే ప్లాన్ తోనే వైసీపీ గట్టి వ్యూహంతోనే టీడీపీకి ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టింది అంటున్నారు. అంతే కాదు, రానున్న నాలుగేళ్ళ కాలానికి సరిపడా షాక్ లన్నీ రెండవ ఏడాది మొదట్లోనే ఇచ్చేస్తే ప్రతిపక్షం నిర్వీర్యం అవుతుంది. మొత్తం రాజకీయ మైదానం ఖాళీ అవుతుంది. ఈ ఎత్తుగడతోనే అచ్చెన్న అరెస్ట్ ఎపిసోడ్ తో కరెక్ట్ టైంలో వైసీపీ ఆపరేషన్ టీడీపీ అంటోంది. ఓ విధంగా ఈ విషయంలో టీడీపీ బలంగా ఫైట్ చేసే అవకాశాలు ఇప్పటికిపుడు చాలా తక్కువ. అందువల్ల ఇందులో విజయం వైసీపీదే. అదే జరిగితే రేపటి రోజున అవతల ఏ రకమైన సౌండ్ లేకుండా రీసౌండ్ చేసే ఛాన్స్ ఒక్క వైసీపీదే మరి.

Tags:    

Similar News