ఇక పార్టీపై ఫుల్ ఫోకస్…? పార్టీతో పాటు దానిని కూడా?

వైఎస్ జగన్ ఏడాది నుంచి సంక్షేమ కార్యక్రమాలపైనే అమలు చేస్తున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పడేశారనే చెప్పాలి. ఎటువంటి పార్టీ కార్యక్రమాలను కూడా జగన్ చేపట్టలేదు. ఏడాదిగా [more]

Update: 2020-06-07 09:30 GMT

వైఎస్ జగన్ ఏడాది నుంచి సంక్షేమ కార్యక్రమాలపైనే అమలు చేస్తున్నారు. పార్టీని పూర్తిగా పక్కన పడేశారనే చెప్పాలి. ఎటువంటి పార్టీ కార్యక్రమాలను కూడా జగన్ చేపట్టలేదు. ఏడాదిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టిన జగన్ ఇప్పుడు పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటున్నారు. ఇందుకోసం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు జగన్ ఇక పార్టీ కోసం కొంత సమయంల కేటాయించాలని జగన్ నిర్ణయించారు.

పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేయడానికి….

పార్టీ క్యాడర్ ను యాక్టివ్ చేయాలని జగన్ నిర్ణయించారు. నిజానికి వైసీపీ గత ఎన్నికల్లో బంపర్ విక్టరీని సాధించింది. 151 సీట్లు రావడం, విపక్ష పార్టీ 23 సీట్లకే పరిమితమవ్వడం, ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకోవాలని జగన్ భావించడంతో పూర్తిస్థాయి సమయాన్ని ప్రభుత్వానికే కేటాయించాలి. మరోవైపు కరోనా మూడు నెలలు ఊపిరి తీసుకోనివ్వక పోవడంతో జగన్ ఇక పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది.

మంత్రులతో పాటు…

జగన్ తో పాటు మంత్రులు సయితం పూర్తిగా పాలనపైనే కాన్సన్ ట్రేషన్ చేశారు. దీంతో జిల్లాల్లో పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల కోసం కూడా ఇప్పటి వరకూ పార్టీ పరంగా ఏమీ చేయలేదు. దీంతో క్యాడర్ లో కూడా అసంతృప్తి తలెత్తింది. నామినేటెడ్ పోస్టులు కూడా ఇప్పటి వరకూ భర్తీ చేయలేదు. దీంతో నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలని జగన్ నిర్ణయించారు.

సోషల్ మీడియాతో సహా….

దీంతో పాటు పార్టీ సోషల్ మీడియాను కూడా జగన్ యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్ ను కూడా పట్టించుకోకపోవడం పై కూడా జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీపై వస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టాలని అధికార ప్రతినిధులకు ఆదేశాలిచ్చారు. ఇలా మొత్తం మీద జగన్ ఏడాది తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సీనియర్ నేతలను జగన్ ఆదేశించారు. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News