ఇద్దరినీ ఒకేసారి హర్ట్ చేసిన జగన్ ?

జగన్ కి ఏమి తెలుసు పాలన అంటారు ఇప్పటికీ చంద్రబాబు. తాను ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీని అని కూడా చెప్పుకుంటారు. మరో వైపు చూసుకుంటే కేసీఆర్ తాను [more]

Update: 2020-06-04 05:00 GMT

జగన్ కి ఏమి తెలుసు పాలన అంటారు ఇప్పటికీ చంద్రబాబు. తాను ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీని అని కూడా చెప్పుకుంటారు. మరో వైపు చూసుకుంటే కేసీఆర్ తాను తలపండిన నేతను అని ఫీల్ అవుతారు. తెలంగాణాను తెచ్చిన జాతిపితను అని కూడా చెప్పుకుంటారు. ఇంత చేసినా ఈ ఇద్దరికీ జగన్ పాపులారిటీ మాత్రం కంగారు పుట్టిస్తోంది. ఓడి ఇంట్లో ఉన్న చంద్రబాబుకు, గెలిచి పొరుగున పాలన చేస్తున్న చంద్రశేఖరరావుకు కూడా జగన్ అంటే కలవరంగానే ఉంది. యువకుడు, కొత్తగా సీఎం అయ్యాడనుకుంటే తొలి ఏడాది దాదాపుగా తన జోరుతో కేసీఆర్ ని ఎప్పటికప్పుడు జగన్ ఇరకాటంలో పెడుతూనే వచ్చారు.

అగ్ర స్థానంలో….

ఇక ఇపుడు జగన్ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నారు. పాపులారిటీ విషయంలో ప్రధాని మోడీనే మించేశారు. ఒక సర్వేలో మోడీకి ప్రధానిగా 68 శాతం మార్కులు వస్తే జగన్ కి 78 శాతం వచ్చిందంటేనే మొనగాడు అనుకోవాలి. ఇక పొలిటికల్ గా బాగా అనుభవమున్న ఒడిషా సీఎం కేరళ సీఎం వంటి వారి తరువాత నాలుగవ స్థానంలో జగన్ నిలవడం అంటే గ్రేటే అంటున్నారు. సీ ఓటర్ సర్వేలో జగన్ కి ప్రజాదరణ బాగా పెరిగిందని తేటతెల్లమైంది. దాదాపుగా నూటికి ఎనభై శాతం మంది జగన్ కి జై కొడుతున్నారు. గత ఏడాది ఎన్నికల ఫలితాలతో పొలిస్తే ఇదే ఎక్కువగా కూడా కనిపిస్తోంది. ఇది టీడీపీకి చేదు వార్త అయితే కేసీఆర్ కి కూడా ఈ తలపోట్లు తప్పడంలేదుగా.

ఏకేసిన బీజేపీ…..

అదేంటో జగన్ ని, ఆయన పాలనను తెలంగాణా బీజేపీ తరచూ మెచ్చుకుంటుంది, ఇక ఆ పార్టీ జాతీయ నాయకులు కూడా జగన్ భేష్ అంటూంటారు. ఇపుడు కూడా తెలంగాణాకు చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కేసీఆర్ ని జగన్ తో పోలుస్తూ ఒక్క లెక్కన ఏకేశారు. పక్క రాష్ట్రం సీఎం జగన్ నాలుగవ స్థానం తెచ్చుకున్నారు. ఆయన పాపులారిటీ జాతీయ స్థాయిలో చర్చగా ఉంది. తెలంగాణా సీఎం 16వ స్థానంలోకి ఎందుకు పడిపోయారో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంవల్లనే ఆయన పాపులారిటీ అలా పడిపోయిందని కూడా అంటున్నారు. హామీలన్నీ జగన్ నెరవేర్చారని, నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పకనే బీజేపీ ఎంపీ చెప్పేశారు. ఓ విధంగా జగన్ తో పోలిక పెడుతూ బీజేపీ నేత అలా విమర్శలు చేయడం సీనియర్ నేతగా కేసీఆర్ కి ఇబ్బందికరమే.

గప్ చిప్పేనా :

ఆ ఒక్క విషయం తప్ప అన్నట్లుగా ఏపీలోని విపక్షం ఉంటోంది. ఇక ఏపీ బీజేపీ అయితే జగన్ పాపులారిటీని కూడా పట్టించుకోకుండా విమర్శలు యధాప్రకారం చేస్తోంది. ఇక్కడో విషయం టీడీపీ కూడా మరచిపోతోంది. జగన్ని కోర్టులకెళ్ళి అడ్డుకున్నాం, అనుకూల మీడియా ద్వారా వార్తలు రాయిస్తున్నామని సంబరపడుతున్నారే కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జగన్ బలన్ని ఇసుమంత అయినా తగ్గించలేకపోయారనడానికి సీ ఓటర్ సర్వే అచ్చమైన ఉదాహరణగా చెప్పుకోవాలి. మొత్తానికి ఏడాది గడచినా కూడా టీడీపీ బతికి బట్టకట్టలేదని ఈ సర్వే యధార్ధం చెప్పిందనుకోవాలేమో.

Tags:    

Similar News