మోడీకి జగన్ భయపడుతున్నారా? లేదా?

జగన్ జీవితంలో భయానికి తావు లేదని ఆయన రాజకీయం చూసిన వారికి అర్ధమవుతుంది. జగన్ కేంద్రంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా ఉన్నపుడే సోనియాను, కాంగ్రెస్ ని ఎదిరించి [more]

Update: 2020-06-06 06:30 GMT

జగన్ జీవితంలో భయానికి తావు లేదని ఆయన రాజకీయం చూసిన వారికి అర్ధమవుతుంది. జగన్ కేంద్రంలో అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా ఉన్నపుడే సోనియాను, కాంగ్రెస్ ని ఎదిరించి బయటకు వచ్చారు. అటువంటి జగన్ లో బెదురు, భయం ఉంటాయా అన్న చర్చ పెడితే లేదు అన్న వారే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే జగన్ ఇలా చేసి ఉండకూడదు అని చాలాసార్లు ఆయన దూకుడు చూసినపుడు విశ్లేషణలు వస్తూంటాయి. రాజకీయాల్లో జగన్ ది ఎపుడూ దూకుడే. అదే ఆయనకు బలం, బలహీనత. మరి జగన్ తన సహజ స్వభావాన్ని వదులుకుని మోడీకో, మరెవరికో భయపడతారు అంటే అది వట్టి రాజకీయ ఆరోపణే అవుతుందేమో.

అలా లింక్ పెట్టి…..

జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి. అవి కొత్తవి కానే కావు. జగన్ వాటిని పదేళ్ళ బట్టి ఎదుర్కొంటున్నారు. జగన్ నిజానికి కేసులకు భయపడితే పదహారు నెలల పాటు జైలులో ఎందుకు ఉంటారు. అన్ని కష్టాలు ఎందుకు పడతారు అన్నది కూడా మరో చర్చ. ఆయన తనను అకారణంగా జైలుకు పంపించిందని కాంగ్రెస్ ని ఈ రోజుకు క్షమించలేకపోతున్నారు. అలాంటిది ఆయన రాజకీయమే తెలిసి ఉంటే తగ్గాలనుకుంటే ఇంతకంటే బెటర్ పొజిషన్లోనే రాజకీయంగా ఈపాటికి ఉండేవారు కదా. మరి జగన్ సీబీఐ కేసులకు భయపడి మోడీకి తలొగ్గుతున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డిలాంటి వారు అనడంలో అర్ధం ఉందా అన్నదే ఇక్కడ చర్చ.

జరిగేది అదేగా….?

కేంద్రం చేతిలో సీబీఐ ఒక చిలుక అని అందరికీ తెలిసినే. దాని మీద సుప్రీం కోర్టు కూడా అప్పట్లో కామెంట్స్ కూడా చేసింది. జగన్ ని ఇబ్బందులు పెట్టాలి అని కేంద్రం అనుకుంటే ఆయన బెయిల్ రద్దు కోసం సీబీఐ ద్వారా గట్టిగా పిటిషన్లు పెట్టించి షాక్ ఇస్తుంది. అయితే బెయిల్ రద్దు అంత సులువు కాదు కానీ ప్రభువులు తలచుకుంటే ఏదైనా సాధ్యమే కాబట్టి అది జరిగిందనుకున్నా జగన్ దానికి జడుస్తారా. ఆయన జైలులో ఉన్నపుడు కూడా వైసీపీ ఒక పార్టీగా విపక్షంలో నిలిచి అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశాన్ని ఎదుర్కొన్న చరిత్ర ఉంది కదా. ఇపుడు ఎటూ ప్రభుత్వంలో ఉన్నారు కూడా. అదే జరిగితే జగన్ మళ్ళీ జైలుకు వెళ్తారేమో. ఇదేమీ కొత్త కాదు కాబట్టి దానికి తగ్గట్లుగా తన ఏర్పాట్లు తాను చేసుకునే ఉంటారు కూడా. మరపుడు ఏమవుతుంది. వైసీపీకే మరింతగా ప్రజలలో సానుభూతి బలం పెరుగుతాయి. మళ్లీ మళ్ళీ ఆ పార్టీ ఏపీలో అధికారంలోకి రావడానికి అదే రాచబాట అవుతుంది.

జనాలే కదా….?

నాయకుడు అన్నవాడు భయపడాల్సింది జనాలకే. వారి విశ్వాసం కోల్పోతే తిరిగి పొందలేరు. దానికి కళ్ళ ముందు ఎంతో మంది సీనియర్ మోస్ట్ నాయకులు కనిపిస్తూనే ఉన్నారు. జగన్ కూడా భయపడుతున్నది దాని గురించే. జనాలకు ఇచ్చిన హామీలు తీర్చాలి, దాని కోసం కేంద్రంతో కాస్తా సహనంతో, రాజీ ధోరణితో ఉంటే కొంత అయినా ఏపీకి మేలు జరుగుతుంది, నిధులు వస్తాయన్నదే జగన్ ఆలోచనగా వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాలుగేళ్ళు కేంద్రంతో బాగుండి చివరి ఏడాది గొడవ పెట్టుకున్నారు. ఫలితంగా ఏపీ జనమే నష్టపోయారు. అలాంటి పరిస్థితి రాకుండా మోడీతో జగన్ సఖ్యతగా ఉండవచ్చేమో. అది కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాల వరకూ పరిధులు చూసుకుని మాత్రేమే. అలా కాకుండా జగన్ ఎందుకు భయపడతారన్నది లాజిక్ కి అందని విమర్శగానే వైసీపీ నేతలు అంటున్నారు. నిజానికి లోక్ సభలో నాలుగవ పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ఎపుడు విపక్ష కూటమి వైపు జరుగుతుందోనని మోడీ అండ్ కోవే జగన్ ని చూసి భయపడాలేమో. ఎందుకంటే రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు కాబట్టి.

Tags:    

Similar News