జగన్ కు… ఆ రెండు చిల్లు పెట్టేస్తున్నాయ్

విభజన తరువాత లోటు బడ్జెట్ తో కిందా మీదా పడుతూ బండి లాగించేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల జీతభత్యాలు ఒక పక్క, ప్రజా సంక్షేమ పథకాలు మరోపక్క ఏపీ [more]

Update: 2020-06-01 05:00 GMT

విభజన తరువాత లోటు బడ్జెట్ తో కిందా మీదా పడుతూ బండి లాగించేస్తుంది ఆంధ్రప్రదేశ్. ఉద్యోగుల జీతభత్యాలు ఒక పక్క, ప్రజా సంక్షేమ పథకాలు మరోపక్క ఏపీ ఖజానా కు దిన దిన గండంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖజానాకు ఎంతోకొంత సాయం చేస్తుంది మద్యం అమ్మకాలు. అయితే రెండు నెలలపాటు లాక్ డౌన్ కారణంగా లిక్కర్ వ్యాపారం మూతపడి మూలిగే నక్కపై తాటిపండు లా పడిపోయింది. అయితే జగన్ సర్కార్ దశలవారీ మద్యపాన నిషేధానికి కట్టుబడే ఒక్కో అడుగు ఆదిశగానే అడుగులు వేస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ దశలవారీ మద్యపాన నిషేధం మాటెలా ఉన్నా రెండు వైపుల నుంచి ముప్పు ముప్పిరిగొంటుంది.

విజృంభిస్తున్న సారా….

ఏపీ లో లాక్ డౌన్ సందర్భంగా లిక్కర్ క్లోజ్ చేసిన సమయంలో సారా బట్టీలు వెలిశాయి. వీటికి తోడు సరిహద్దు రాష్ట్రాల్లో అయితే అడ్డు అదుపు లేకుండా సారా ప్రవాహం ఏపీలోకి వచ్చిపడుతుంది. లాక్ డౌన్ తరువాత ఎపి లో మద్యం అమ్మకాలు మరింత తగ్గించేందుకు జగన్ సర్కార్ 75 శాతం ధర పెంచింది. దాంతో చీప్ లిక్కర్ సేవించేవారంతా సారా వైపు ఎక్కువమంది టర్న్ అయ్యారు. దీన్ని పూర్తిస్థాయిలో నిరోధించేంత సిబ్బంది ఎక్సయిజ్ శాఖలో లేరు. పోలీసులే ఈ మాఫియా సంగతి చుడాలిసి వస్తుంది. ఈ పరిణామం కారణంగా పెద్ద ఎత్తునే ఎపి ఖజానాకు చిల్లు పడిపోతుంది.

మద్యం మాఫియా కు పండగ …

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు దేశంలోనే అత్యధికం. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలనుంచి అక్రమ మద్యం ఏరులై పారుతుందని ఇటీవల దాడుల్లో పట్టుబడుతున్న లిక్కర్ చెప్పకనే చెప్పేస్తుంది. ఒక క్వార్ట్ ర్ బాటిల్ కి 200 లనుంచి 300 ల వరకు ఇతర రాష్ట్రాలకు ఏపీకి ఉంటుంది. దాంతో సులభంగా ఏపీ లో విక్రయించేందుకు సరిహద్దు రాష్ట్రాల్లోని లిక్కర్ మాఫియా పెద్ద ఎత్తునే రంగంలోకి దిగిపోయింది. సరుకు విజయవంతంగా తరలిస్తే వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా నడుస్తుంది. ఏపీ లో ఇసుక మద్యం మాఫియా ల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. వీరికి ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఎన్ని టాస్క్ ఫోర్స్ లు ఉన్నా అక్రమ మార్గాల్లో అవినీతి అధికారులకు లంచాలు ఇస్తూ మాఫియా చెలరేగిపోతూ సర్కార్ ఆదాయానికి భారీగా గండికొట్టేస్తుంది. మరి దీనిపై జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News