వెన‌క్కి త‌గ్గేది లేదు.. కేసీఆర్‌కు జ‌గ‌న్ షాకిస్తారా..?

సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారిన ఏపీ సీఎం జ‌గ‌న్.. మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా అడుగులు వేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రైతుల ప‌క్షపాతిగా.. గ‌తంలో జ‌గ‌న్ [more]

Update: 2020-06-01 15:30 GMT

సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారిన ఏపీ సీఎం జ‌గ‌న్.. మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా అడుగులు వేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రైతుల ప‌క్షపాతిగా.. గ‌తంలో జ‌గ‌న్ తండ్రి వైఎస్ సాధించిన పేరుకు అనుగుణంగానే జ‌గ‌న్ కూడా దూకుడుగా ముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రైతు భ‌రోసా స‌హా .. రైతు స‌ల‌హా మండ‌ళ్లు.. సాగు నీటికి ఉద‌య‌మే 9 గంట‌ల క‌రెంటు.., ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇలా అనేక రూపాల్లో సాయం చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ రాయ‌ల సీమ రైతుల విష‌యంలో మ‌రింత గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగాల‌ని నిర్ణయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు మీదుగా రాయల సీమకు జ‌లాల‌ను త‌ర‌లించే విష‌యం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని జ‌గ‌న్ స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో…..

తాజాగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఏడాది పాల‌న‌పై స‌మీక్షల విష‌యంలో రైతుల విష‌యాన్ని ప్రస్థావించిన జ‌గ‌న్‌.. ఈ ఏడాది కాలంలో రైతుల‌కు చేసిన ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. రాయలసీమ కరువు నివారణ కోసం తెస్తున్న ప్రాజెక్ట్‌లపై వివాదాలు సృష్టిస్తున్నారనేది జ‌గ‌న్ ప్రధాన ఆవేద‌న. ప్రతిప‌క్ష నేత‌ చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు చేస్తున్నాయ‌ని జ‌గ‌న్ ఆవేద‌న వ్యక్తం చేశారు. అదేస‌మ‌యంలో శ్రీశైలం నుంచి ఎట్టి ప‌రిస్థితిలోనూ నీటిని సీమ‌కు త‌ర‌లించే ప్రతిపాద‌న‌ను స‌మ‌ర్ధించారు.

పరోక్షంగా కేసీఆర్ కు…..

881 అడుగులు ఉన్నప్పుడే 44 వేల క్యూసెక్కులు తీసుకోగలమ‌ని, 854 అ డుగుల్లో ఉంటే కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలమ‌ని ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ కరువు ఎలా తీర్చాలి? అని ప‌రోక్షంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను జ‌గ‌న్ ప్రశ్నించారు. 800 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు తీసుకెళ్తోంద‌ని, అదే 800 అడుగుల వద్ద మ‌న‌కు కేటాయించిన నీళ్లను మ‌నం తీసుకుందామ‌ని అన్నారు. ఇలా తీసుకోవడం ఎవరికీ నష్టం కాదని సీఎం ద్ఘాటించ‌డాన్ని బ‌ట్టి ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని జ‌గ‌న్ స్పష్టం చేశారు. అప్పు డే రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంద‌ని కూడా జ‌గ‌న్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రైతులకు అండగా…..

దశాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఆహారధాన్యాల దిగుబడి పెరిగింద‌ని, ఏడాదికాలంలో ఆహార ధాన్యాల దిగుబడి 150 లక్షల నుంచి మెట్రిక్‌ టన్నుల నుంచి 172 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగింద‌ని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రైతుల ప‌క్షాన మ‌రింత గ‌ట్టిగా నిలిచేం దుకు జ‌గ‌న్ స‌న్నద్ధంగా ఉన్నార‌నేందుకు ఇదే ప్రబ‌ల నిద‌ర్శన‌మ‌ని అంటున్నారు మేధావులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News