ఏడాది రిజ‌ల్ట్‌: జ‌గ‌న్ స‌ర్కారు మంత్రం అదేనా?

ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిపాల‌న ప్రారంభించి ఏడాది పూర్తయింది. గ‌త ఏడాది మే 30న అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. ఈ ఏడాది పాల‌న‌లో నిజానికి [more]

Update: 2020-05-30 02:00 GMT

ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రిపాల‌న ప్రారంభించి ఏడాది పూర్తయింది. గ‌త ఏడాది మే 30న అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌.. ఈ ఏడాది పాల‌న‌లో నిజానికి చివ‌రి రెండున్నర మాసాలు కూడా క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌రిపాల‌న‌, అభివృద్ది వంటివి తీవ్రస్థాయిలో ప్రభావిత‌మ‌య్యాయి. ఎక్కడిక‌క్కడ ప‌నులు ఆగిపోయాయి. అయినా కూడా మొత్తంగా ఏడాదిని ప్రామాణికంగా చూస్తే.. సీఎంగా, వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్‌.. మ‌హిళ‌ల‌కు ఇస్తున్న ప్రాధాన్యం చూసి.. ప‌క్కరాష్ట్రాలు కూడా మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వక త‌ప్పని ప‌రిస్థితి ఏర్పడింది. ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపు నుంచి ప్రభుత్వంలో మంత్రి ప‌ద‌వుల వ‌రకు జ‌గ‌న్ ప్రాధాన్యం మ‌హిళ‌ల‌వైపే ఉండ‌డం గ‌మ‌నార్హం.

మహిళలకు అండగా….

ఏపీ చ‌రిత్రలోనే లేన‌ట్టుగా వైసీపీ నుంచి ఏకంగా 25 మంది వ‌ర‌కు మ‌హిళా ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక అర‌కు నుంచి గొడ్డేటి మాధ‌వి, అన‌కాప‌ల్లి నుంచి స‌త్యవ‌తి, కాకినాడ నుంచి వంగా గీత‌, అమ‌లాపురం నుంచి చింతా అనూరాధ ఎంపీలుగా గెలిచారు. ఇక ముగ్గురు మ‌హిళా మంత్రుల‌ను నియ‌మించి జ‌గ‌న్‌.. ఏపీఐఐసీ వంటి కీల‌క సంస్థకు చైర్‌ప‌ర్సన్‌గా నగిరి ఎమ్మెల్యే రోజాను కూర్చోబెట్టారు. ఇక‌, డిప్యూటీసీఎంగా పుష్ప శ్రీవాణి, మంత్రులుగా మేక‌తోటి సుచ‌రిత‌, తానేటి వ‌నిత‌కు అద్బుత‌మైన‌, అరుదైన అవ‌కాశం ఇచ్చారు జ‌గ‌న్‌. అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి గా కూడా ఓ మ‌హిళ‌కే జ‌గ‌న్ ఛాన్స్ క‌ట్టబెట్టడం వెనుక ఆయ‌న మ‌హిళా ప‌క్షపాతిగా ముద్ర వే‌సుకున్నారు.

అన్నీ వారి పేరిటే…..

ఇక‌, రాజ‌కీయంగా స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ మ‌హిళ‌ల‌కు, ఎస్సీ, బీసీ వ‌ర్గాల‌కు చెంది న మ‌హిళ‌ల‌కు మెజారిటీ సీట్లు క‌ట్టెబ‌ట్టి.. మ‌గువ‌ను మ‌హారాణిని చేశారు జ‌గ‌న్‌. సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా.. మ‌హిళ‌ల‌కు మెజారిటీ పార్ట్ అవ‌కాశం క‌ల్పించారు సీఎం జ‌గ‌న్‌. ప్రభుత్వం త‌ర‌ఫున సంక్రమించే ఏ సంక్షేమ కార్యక్రమాన్నయినా.. కూడా మ‌హిళ పేరుతో జ‌రిగేలా చ‌ర్యలు తీసుకున్నారు. రేష‌న్ కార్డుల నుంచి ఇళ్ల స్థలాల వ‌ర‌కు మ‌హిళ‌ల పేరుతో ఇచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, బీసీల‌తో పాటు మ‌హిళ‌ల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల ప్రాథినిత్యం మ‌రింత పెంచ‌డం కూడా జ‌గ‌న్‌కు చాలా ప్లస్ అయ్యింది.

మహిళను ఆకట్టుకునేందుకు….

అదేవిధంగా అమ్మ ఒడి స‌హా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అమౌంటును కూడా మాతృమూర్తుల బ్యాంకు ఖాతాల్లోనే వేసేలా చ‌ర్యలు తీసుకున్నారు. ఇలా ప్రతి విష‌యంలో మ‌హిళ‌ల‌కు జ‌గ‌న్ ప‌ట్టాభి షేకం చేశారు. అదే స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం క‌ల్పించేందుకు స్వయం స‌హాయ‌క బృందాల్లో మ‌హిళ‌ల పాత్రను మ‌రింత ప‌టిష్టం చేశారు. వారికి రుణాలు ఇచ్చేలా ప్రోత్సహించారు. ఇలా .. జ‌గ‌న్ మ‌హిళ‌ల ప‌క్షపాతిగా పేరు సంపాయించ‌డం.. మ‌హిళా మంత్రంతో ముందుకు సాగుతూ ఉన్నారు. అదే విధంగా సంపూర్ణ మ‌ద్యపాన నిషేధం దిశ‌గా జ‌గ‌న్ వేస్తోన్న అడుగులు కూడా మ‌హిళల్లో జ‌గ‌న్ ప‌ట్ల సానుభూతి పెంచుతున్నాయి.

Tags:    

Similar News