హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు…. క‌డ‌ప‌లో పెరుగుతున్న ఫైటింగ్‌

క‌డ‌ప జిల్లా వైసీపీ నేత‌ల్లో మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు రోజు రోజుకు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. జిల్లా మొ త్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. [more]

Update: 2020-06-02 06:30 GMT

క‌డ‌ప జిల్లా వైసీపీ నేత‌ల్లో మంత్రి వ‌ర్గంపై ఆశ‌లు రోజు రోజుకు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. జిల్లా మొ త్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. 2014లో ఒక్క రాజంపేట‌లో వైసీపీ ఓడ‌గా… గ‌త ఎన్నిక‌ల్లో కూడా అదే రాజంపేట నుంచి అదే ఎమ్మెల్యే మ‌ళ్లీ వైసీపీ నుంచి గెలిచారు. ఇక రెండు ఎంపీలు కూడా మ‌రోసారి వ‌రుస‌గా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి వైసీపీ నుంచి ఈ జిల్లాలో గెలిచిన వారిలో చాలా మంది జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు ఉన్నారు. కొంద‌రు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నేత‌లు కూడా ఉన్నారు. మ‌రికొంద‌రు వైసీపీ కోసం అనేక త్యాగాలు చేసిన వారు ఉన్నారు. ఇంకొంద‌రు జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు కూడా ఉన్నారు. ఇలా మొత్తంగా క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్‌కు అంద‌రితోనూ అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఒక్కరికే మంత్రి పదవి….

అయితే, ఇక్కడి వారిలో కేవ‌లం ఒక్క నాయ‌కుడికి మాత్రం గ‌త ఏడాది మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. క‌డ‌ప నుంచి విజ‌యం సాధించిన అంజాద్ బాషాకు జ‌గ‌న్ డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చి గౌర‌వించారు. అయితే, జిల్లాలోని కీల‌క నేతలు మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నా.. కొన్ని స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌ని నేప‌థ్యంలో జ‌గ‌న్ వారికి ఛాన్స్ ఇవ్వలేక పోయారు. జిల్లాలో రిజ‌ర్వ్‌డ్ సీట్లు వ‌దిలేస్తే మిగిలిన అన్ని ప‌ద‌వులు రెడ్డి సామాజిక వ‌ర్గానికే ఉన్నాయి. పైగా అంద‌రు రెండు మూడు సార్లు గెలిచిన వాళ్లే. దీంతో జ‌గ‌న్ మాత్రం ఎంత మందికి అని మంత్రి ప‌ద‌వులు ఇస్తారు. అయితే, వ‌చ్చే ద‌ఫా అయినా.. మంత్రి ప‌ద‌వి త‌మ‌కు ద‌క్కడం ఖాయ‌మంటే.. త‌మ‌కు ద‌క్కడం ఖాయ‌మ‌ని ఇక్కడి నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. వీరిలో ప్రధానంగా ముగ్గురు నాయ‌కులు క‌నిపిస్తున్నారు.

శ్రీకాంత్ రెడ్డి ఆశగా…

వీరిలో ప్రస్తుతం చీఫ్ గా ఉన్న గ‌డికోట శ్రీకాంత్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జ‌గ‌న్‌కు స‌న్నిహితుడు, రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు న‌మోదు చేస్తున్నారు. కేబినెట్ ఏర్పాటు స‌మయంలోనే త‌న‌కు ఛాన్స్ ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, ద‌క్కలేదు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ చీఫ్ విప్ ప‌ద‌విని అప్పగించారు. దీంతో ఆయ‌న వ‌చ్చే ద‌ఫా కేబినెట్ కూర్పుపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వీడిన‌ప్పుడు ఆయ‌న వెంట ఉన్న తొలి ఎమ్మెల్యే శ్రీకాంతే. ఇక‌, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం రైల్వే కోడూరు నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న కొరుముట్ల శ్రీనివాస్ కూడా భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఆయ‌న వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుస్తూ వ‌స్తున్నారు.

బరిలో ముగ్గురు…..

అదేవిధంగా మ‌రో కీల‌క నేత‌, జ‌గ‌న్‌కు బంధువు క‌మ‌లాపురం నుంచి విజ‌యం సాదించిన పీ. రవీంద్రనాథ్‌రెడ్డి కూడా మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ ముగ్గురు ఎవ‌రికి వారే మంత్రి పీఠంపై ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక మైదుకూరులో సీనియ‌ర్ ర‌ఘురామిరెడ్డి కూడా ఈ సారి త‌న‌కు ప‌ద‌వి ఇవ్వాల‌ని ఓపెన్‌గానే అడుగుతున్నారు. ఇటు జ‌గ‌న్‌కు, అటు పార్టీకి కూడా వీరు చాలా కీల‌క‌మైన నాయ‌కులే. దీంతో వీరు ఆశించ‌డంలో ఎలాంటి త‌ప్పులేదు. కానీ, అవ‌కాశం మాత్రం త‌క్కువ‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రికి రెండున్నరేళ్ల త‌ర్వాత మంత్రి పీఠం ద‌క్కుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News