రాయల్ గా సీమనేలుతాడా? బాబుకు దిక్కులేదా?

అదేంటో సాలిడ్ గా సీమను ఏలుకోమని చంద్రబాబు జగన్ కి దత్త మండలాలను రాసిచ్చేశారులా ఉంది. కనీసం ఉలుకూ పలుకూ లేదు. రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు, [more]

Update: 2020-05-27 03:30 GMT

అదేంటో సాలిడ్ గా సీమను ఏలుకోమని చంద్రబాబు జగన్ కి దత్త మండలాలను రాసిచ్చేశారులా ఉంది. కనీసం ఉలుకూ పలుకూ లేదు. రాయలసీమలో 52 అసెంబ్లీ సీట్లు, ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి. మొత్తం ఏపీలో ఈ సీట్లు చాలా కీలకమైనవి. ఓ విధంగా గతంలో కాంగ్రెస్, ఇపుడు జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న రాయలసీమను చంద్రబాబు అసలు పట్టించుకోవడంలేదు. ఆయన సీమ వాసి అయి ఉండి కూడా ఎందుకో ఈ ప్రాంతంపై ఆశలు చంపుకున్నారా అనిపించకమానదు. 2011 నుంచి జగన్ ప్రభంజనం రాయలసీమ జిల్లాల్లో మొదలైంది. అది అలా కొనసాగుతూ 2019 నాటికి మహోధృతమైంది.

దీటుగా లేరా….?

జగన్ కి రాయలసీమలో దీటు అయిన నేత ఎవరూ కనిపించడంలేదు, పైగా పోటీ కూడా లేదు. నిజానికి పక్క జిల్లాకు చెందిన చంద్రబాబే జగన్ కి గట్టి పోటీదారు కావాలి. కానీ చంద్రబాబుకు ఎందుకో సీమ జనాలు పట్టుకు దొరడంలేదు. సీమ జనం మాటకు కట్టుబడతారు. దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. ముఖ్యంగా పౌరుషానికి వారు పెద్ద పీట వేస్తారు. పొరాడేవారిని సమాదరిస్తారు. అందుకే ఒకప్పుడు సీమలో వామప‌క్షాలు కూడా జెండా పాతేశాయి. ఇపుడు సీమ జనాలకు జగన్ లో ఆ పోరాటం కనిపిస్తోంది. అందుకే ఆయన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు.

గోడ కట్టేసారా…?

జగన్ సీమ జిల్లాలకు ఎదురులేని నేత అయిపోయారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమలోని కర్నూల్ ని రాజధానిగా ప్రకటించడమే కాదు, హైకోర్టుని తరలిస్తామని చెప్పారు. ఇక కడపలో ఉక్కు పరిశ్రమ కానీ, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడంలో కానీ జగన్ తన చిత్త శుధ్ధిని చాటుకుంటున్నారు. ఇక జగన్ తాజాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్ధ్యం పెంచడం కూడా సీమ జనాల జేజేలు అందుకునేదే. దాంతో జగన్ ఇక్కడ గట్టి రాజకీయ పునాది వేసుకున్నారు. ప్రత్యర్ధి పార్టీలు దరిదాపులకు రాకుండా గోడ కట్టెస్తున్నారు.

ఇబ్బందే మరి…..

ఈ రకంగా ఏపీలో అతి ముఖ్యమైన సీమ జిల్లాలను జగన్ కి దారాదత్తం చేసి కేవలం కోస్తా ఉత్తరాంధ్రా జిల్లాలను చంద్రబాబు నమ్ముకోవడం ద్వారా ఉన్న ప్రాంతానికి, పుట్టినూరికీ కూడా చెడిపోయారు. ఇతర ప్రాంతాల రాజకీయంతో జూదమాడుతున్నారు. చంద్రబాబు పార్టీకి కనీసం మూడు కీలక‌మైన ప్రాంతాలలో ఒక్క దానిలో కచ్చితంగా మెజారిటీ సీట్లు వస్తాయన్న గ్యారంటీలేదు. అలా టీడీపీని చేసి తాను కూడా దూరమయ్యారు. జగన్ మాత్రం సీమలో పట్టు సాధించి కోస్తా, ఉత్తరాంధ్రా వైపు చూస్తున్నారు. అక్కడ సగం సీట్లు వచ్చినా జగన్ ఎపుడూ సీఎం అయ్యే చాన్స్ ఉంటుంది. మరి రాజకీయ చాణక్యం తెలిసిన చంద్రబాబు మాత్రం సీమను విస్మరించడం అంటే రాజకీయ ఆత్మహత్యగానే చూడాలి అంటున్నారు.

Tags:    

Similar News