ఈయన పెట్టే ఫిట్టింగ్ లకు ఫీజులెగిరిపోయేలా ఉన్నాయే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అయపోయారు. విపక్షాలకు ఊపిరి కూడా తీసుకోనివ్వడం లేదు. పార్టీలను ప్రాంతాల వారీగా చీల్చేందుకు జగన్ చేస్తున్న ప్రతి కార్యక్రమం [more]

Update: 2020-05-14 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెద్ద ఫిట్టింగ్ మాస్టర్ అయపోయారు. విపక్షాలకు ఊపిరి కూడా తీసుకోనివ్వడం లేదు. పార్టీలను ప్రాంతాల వారీగా చీల్చేందుకు జగన్ చేస్తున్న ప్రతి కార్యక్రమం ఉంటుందని రాజకీయ నిపుణులు సయితం అభిప్రాయపడుతున్నారు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేసుకుని మరీగా జగన్ పక్కాగా ముందుకు వెళుతున్నారు. తనకు ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని అన్ని ప్రాంతాల్లో వీక్ చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కన్పిస్తుంది.

రాజధాని తరలింపు అంశంతో….

మొన్న రాజధాని తరలింపు అంశంతో తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీలూ ఇరుకున పడ్డాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రాంతాల వారీగా చీలిపోయారు. జగన్ నిర్ణయాన్ని టీడీపీ నేతలే స్వాగతించారు. రాయలసీమలో హైకోర్టు, విశాఖలో పరిపాలన రాజధాని అంశం విపక్ష పార్టీల్లో చిచ్చు పెట్టింది. చివరకు సీపీఐ కర్నూలు శాఖ కూడా తన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ ఈ అంశంతో విపక్షాలకన్నా పై చేయి సాధించారు.

పోతిరెడ్డి పాడు అంశంలో…

తాజాగా పోతిరెడ్డి పాడు అంశం మరో రచ్చకు దారితీసేలా ఉంది. పోతిరెడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాయలసీమ నాలుగుజిల్లాలకే కాకుండా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు నీటి ఎద్దడి తొలుగుతుంది. జీవో విడుదలయి వారం గడుస్తున్నా టీడీపీ దీనిపై ఒక స్టాండ్ తీసుకునే అవకాశం లేకుండా చేశారు జగన్. పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపును వ్యతిరేకిస్తే టీడీపీకి సీమలో పుట్టగతులుండవు. అలాగని జగన్ వేస్తున్న ఉచ్చులో చిక్కుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు.

నాన్చినా నష్టమేగా?

అందుకే పోతిరెడ్డి పాడు ఇష్యూను నాన్చడానికే చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ నాన్చినా చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రతిపక్ష టీడీపీ కలసి రావడం లేదని జగన్ పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశముంది. వైసీపీ నేతలు టీడీపీ వైఖరిపై విరుచుకుపడతారు. ఈ నేపథ్యంలో జగన్ పెట్టే ఫిట్టింగ్ లకు తెలుగుదేశం పార్టీ నేతలకు ఊపిరి ఆడటం లేదు. ఒక ఏడాదిలోనే ఇన్ని ఫిట్టింగ్ లు పెడితే రానున్న నాలుగేళ్ల కాలాన్ని తట్టుకునే శక్తి సైకిల్ పార్టీకి ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Tags:    

Similar News