జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారా?

జగన్ విపక్షంలో ఉన్నపుడే ఎక్కువగా మాట్లాడేవారు. అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా మౌన మౌనిగా మారిపోయారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది [more]

Update: 2019-11-20 13:30 GMT

జగన్ విపక్షంలో ఉన్నపుడే ఎక్కువగా మాట్లాడేవారు. అధికారంలోకి వచ్చాక ఆయన పూర్తిగా మౌన మౌనిగా మారిపోయారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు కావస్తోంది కానీ ఇప్పటి వరకూ మీడియా సమావేశం పెట్టలేదు. ఇక ఆయన ఏదైనా బహిరంగ సభల్లో మాట్లాడడమే తప్ప ఇదీ విషయం అని దేనిమీద తన అభిప్రాయాలను పంచుకోలేదు. ఇక జగన్ తీరు అలా ఉంటే మంత్రులు మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. జగన్ క్యాబినేట్లో కొందరు మంత్రులు ఉన్నారు. వారు రఫ్ అండ్ టఫ్ గా వ్యవహరిస్తున్నారు అనవసరంగా రచ్చ చేస్తూ టీడీపీకి ఎక్కడ లేని సింపతీ మైలేజ్ తెస్తున్నారు. అదే సమయంలో జగన్ జనంలో తెచ్చుకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. ఇంతకు ముందు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉండేవారు. ఆయన అసెంబ్లీ లోపలా బయట రాష్ గానే బిహేవ్ చేస్తూండడంతో జగన్ అప్పట్లో పిలిచి మాట్లాడారని టాక్ వచ్చింది.

కొడాలి గొడవలే…

ఇక కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని మాటల దూకుడుకు అడ్డూ అదుపూ లేకపోతోంది. నాని మాట్లాడితే చాలు సభ్యత తగ్గుతోందని మీడియాలోనే కామెంట్స్ పడుతున్నారు. వాడకూడని పదాలు వాడుతూ కొడాలి మీడియా ముందు చేస్తున్న వీరంగం ఓ విధంగా వైసీపీకి ఎక్కడలేని చెడ్డపేరు తెచ్చేదే. సాధరణంగా రాజకీయల్లో ఈ తరహా భాష వాడరు. ఇక అధికారంలో ఉన్న వారు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాన్ని వేయి కళ్ళతో జనాలు కనిపెడుతూ ఉంటారు. పగవాడు ప్రశ్న వేసినా స్పందించాల్సించింది జనం కోణం నుంచే. జనానికే జవాబుగా అది ఉండాలి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కొడాలి జవాబు చాలా దారుణంగా ఉంది. చిత్రమేంటంటే సన్న బియ్యం విషయంలో వైసీపీ చెప్పింది కరెక్ట్. వచ్చే ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం ఇస్తామని కూడా చెప్పింది. అయితే వైసీపీని కెలకాలని దేవినేని ఉమ సన్నబియ్యం విషయం లాగారు. ఆ ట్రాప్ లో పడిపోయిన నాని దారుణమైన కామెంట్స్ చేశారు. ఇపుడు జనంలో జగన్ సర్కార్ పలుచన అయిపోయింది.

జగన్ స్క్రిప్ట్ ట….

నిజమే ఇది జగన్ ప్రభుత్వం అంటారు. ఎవరు తప్పు చేసినా అది జగన్ మెడకే చుట్టుకుంటుంది. ప్రతీ రోజూ మంత్రుల మాటలను దగ్గర ఉండి మానిటర్ చేయడం ఏ ప్రధాని, ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు. కానీ మంత్రుల తీరుని ఎప్పటికపుడు అంచనా వేసుకోవడం ముఖ్యమంత్రి జగన్ బాధ్యత. అందువల్ల వారు నోరు హద్దు మీరకుండా చూసుకోకపోతే అటు తిరిగి ఇటు తిరిగి జగన్ కే మచ్చగా మారుతుంది. ఇక జగన్ స్క్రిప్ట్ అంటోంది విపక్షం. వల్లభనేని వంశీ మాట్లాడినా, కొడాలి నాని పెద్ద నోరు చేసుకున్నా జగన్ ని కంపు చేయాలని చూస్తున్నారు పసుపు తమ్ముళ్ళు. ఇవన్నీ అనుకూల మీడియా పదే పదే చూపించడం ద్వారా సర్కార్ని బదనాం చేసేందుకు రెడీ అవుతోంది. మరి వీటిని జగన్ కట్టడి చేయకపోతే భారీ నష్టం తప్పదు.

Tags:    

Similar News