నాయిస్ తప్ప… నో కేెసెస్… వాయి‌స్ పెంచనున్న టీడీపీ

జగన్ ప్రభుత్వం వరసగా విచారణలకు ఆదేశిస్తుంది. కానీ దాని ఫలితం మాత్రం ఉండటం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి తాము అవినీతికి పాల్పడలేదని గట్టిగా చెప్పుకోవడానికి వాయిస్ [more]

Update: 2020-05-15 12:30 GMT

జగన్ ప్రభుత్వం వరసగా విచారణలకు ఆదేశిస్తుంది. కానీ దాని ఫలితం మాత్రం ఉండటం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి తాము అవినీతికి పాల్పడలేదని గట్టిగా చెప్పుకోవడానికి వాయిస్ వస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక అంశాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో తాము ఆరోపించిన అంశాలపైనే జగన్ సర్కార్ ఎక్కువ ఫోకస్ పెట్టింది.

పాదయాత్రలో ఆరోపణలపై….

జగన్ తన పాదయాత్రలో అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు చేశారు. ప్రధానంగా రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై అవినీతి జరిగిందని ఆరోపించారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి రాగానే దానిపై మంత్రుల కమిటీ వేశారు. ఈ కమిటీ దాదాపు ఐదు వేల ఎకరాల భూమిని టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసినట్లు నివేదిక అందించారు. బినామీ పేర్లు బయటకు తీస్తామన చెప్పారు.

రాజధాని భూముల కొనుగోళ్లపై….

దీనిపై సీఐడీ విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. తొలిరోజుల్లో కొంత హడావిడి చేసిన సీఐడీ విచారణ తర్వాత ముందుకు సాగడం లేదు. ఇక పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో సయితం పెద్దయెత్తున అవినీతి జరిగినట్లు జగన్ ఆరోపించారు. దానిపై కూడా ఇంతవరకూ నిజాలు నిగ్గు తేల్చలేదు. దీంతో పాటు ఈఎస్ఐ స్కామ్ లోనూ టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు చెప్పారు.

ఈఎస్ఐ మందుల స్కామ్….

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా ఇంతవరకూ విచారణ ముందుకు సాగలేదు. కరోనా వైరస్ అని సర్దిచెప్పుకుంటున్నా నెలలు గడుస్తున్నా విచారణలు ముగియకపోవడం, ఏదీ తేలకపోవడం జగన్ సర్కార్ కు ఇబ్బంది అనే చెప్పాలి. తమపై నిరాధార ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారని జగన్ పై టీడీపీ రివర్స్ అటాక్ చేయనుంది. కేవలం కంటితుడుపు విచారణలే తప్ప ఎలాంటి చర్యలు ఇంతవరకూ చేపట్టకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News