జగన్ ఊ అంటే రెడీ నా …?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసి ఆంక్షలు మాత్రం కొనసాగించడానికి సిద్ధంగా ఉందా ? జగన్ అందుకే ప్రజలను సాధారణ పరిస్థితుల్లోకి తెచ్చేందుకు వైరస్ కి భయపడకండి [more]

Update: 2020-05-01 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసి ఆంక్షలు మాత్రం కొనసాగించడానికి సిద్ధంగా ఉందా ? జగన్ అందుకే ప్రజలను సాధారణ పరిస్థితుల్లోకి తెచ్చేందుకు వైరస్ కి భయపడకండి దీనికి మందు లభించే వరకు మనతోనే ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని దూరంగా పెట్టొచ్చు అంటూ ఇటీవల జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఎంతకాలం దాక్కోవాలి? బయట వుండే పోరాడాలి అనే రీతిలో ఉంది. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శించినా నిజమే ఎన్ని నెలలు కలుగులో ఉండాలి అనే చర్చ ప్రజల్లో మొదలైంది. సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరిస్తూ, చేతులు శుభ్రపరుచుకుంటే వైరస్ దరి చేరకుండా జాగ్రత్త పడొచ్చు కదా అనే ఎక్కువమంది భావిస్తున్నారు. అందుకే తమ దైనందిన జీవనాన్ని ఆరంభించాలనే జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

గ్రీన్ జోన్స్ లో రొటీన్ ….

రాష్ట్రంలో దాదాపు 80 శాతం గ్రీన్ జోన్ ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అన్ని కార్యకలాపాలను మొదలు పెట్టాలన్నదే ఏపీ సర్కార్ ఆలోచనగా ఉంది. మే 3 వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల కోసం జగన్ ప్రభుత్వం ఎదురు చూస్తుంది. దీనివల్ల ఆర్ధిక కార్యకలాపాలు మొదలు అయి జవసత్వాలు సడలిన రాష్ట్రానికి కొంత ఉపశమనం కలుగుతుందని యంత్రాంగం సైతం అంచనాకు వచ్చింది. కుదేలైన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గాడిన పెట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవని ఆందోళనను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు జగన్.

మోడీ ఒకే అంటేనే?

అయితే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కి సంబంధించి ఒకే విధానం ఉంటుంది కనుక తమ విన్నపాలు విన్నవించడం తప్ప ఏపీ ప్రభుత్వం చేసేదేమి లేదు. మోడీ ఎస్ అంటే మాత్రం తక్షణం గ్రీన్ జోన్స్ లో అన్నిరకాల యాక్టివిటీస్ మొదలు కానున్నాయి. అయితే విద్యా సంస్థలు, మద్యం దుకాణాలు, సినిమాథియేటర్లు, మాల్స్, ప్రార్ధనామందిరాల విషయంలోనూ బహిరంగ సమావేశాల పైనా నిషేధాజ్ఞలు కొనసాగించాలని జగన్ సర్కార్ రెడీ అయ్యింది. మరి దీనిపై ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News