టీడీపీకి క‌ళ్లెం వేసేలా జ‌గ‌న్ వ్యూహం.. కమ్మవారికే అక్కడ ప్రయారిటీ

ఎత్తుకు పైఎత్తు వేయ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్‌. అయితే, అదిరిపోయేలా ఎత్తు వేసి… ప్రత్యర్థి పార్టీని మ‌రింతగా ముప్పుతిప్పలు పెట్టడం అనేది వైసీపీ అధినేత జ‌గ‌న్‌కే చెల్లింద‌ని చెబుతున్నారు. [more]

Update: 2020-05-05 02:00 GMT

ఎత్తుకు పైఎత్తు వేయ‌డం రాజ‌కీయాల్లో కామ‌న్‌. అయితే, అదిరిపోయేలా ఎత్తు వేసి… ప్రత్యర్థి పార్టీని మ‌రింతగా ముప్పుతిప్పలు పెట్టడం అనేది వైసీపీ అధినేత జ‌గ‌న్‌కే చెల్లింద‌ని చెబుతున్నారు. టీడీపీకి అత్యంత పట్టున్న ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైసీపీని ప‌రుగులు పెట్టించేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప‌శ్చిమ‌లో టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీని పెద్ద ఎత్తున బ‌లోపేతం చేస్తున్నారు. ఈ జిల్లాలో రెండు ప్రాంతాల్లో కులాల ప‌రంగా జగ‌న్ క్యాస్ట్ ఈక్వేష‌న్లతో ముందుకు వెళుతున్నట్టే క‌నిపిస్తోంది. మెట్ట ప్రాంతంలో ఎక్కువ‌గా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నారు. మెట్ట ప్రాంతం కింద‌కు వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ వ‌ర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు.

మెట్ట ప్రాంతంలో…..

ముఖ్యంగా త‌న‌కు అత్యంత స‌న్నిహితులుగా ఉన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌద‌రికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే స‌మ‌యంలో చింత‌పూడి, గోపాల‌పురం, దెందులూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో మండ‌ల స్థాయిలో క‌మ్మల‌కు ప్రాధాన్యం పెంచారు. పోల‌వ‌రంలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ సైతం మెట్టలో చింత‌ల‌పూడి, పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ వ‌ర్గానికి వ్యూహాత్మకంగా ఎక్కువ ప‌ద‌వులు ఇస్తూ వైసీపీ వైపు తిప్పుకోవ‌డంతో పాటు త‌న వ్యక్తిగ‌త ఓటు బ్యాంకు కూడా పెంచుకున్నారు. దీంతో మెట్ట ప్రాంతంలోని నాలుగైదు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీలో ఉన్న క‌మ్మవ‌ర్గం దూకుడుకు చెక్ పెట్టిన‌ట్టయింది.

ఇక్కడ క్షత్రియ వర్గానికి….

ఇక‌, ఇదే విధంగా జిల్లాలోని మ‌రో కీల‌క ప్రాంతం డెల్టాలోనూ వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. డెల్టా ప్రాంతాల కింద‌కు వ‌చ్చే న‌ర‌సాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. అవే… క్షత్రియ‌, బీసీ వ‌ర్గాలు. వీరి ఓటు బ్యాంకు అత్యంత కీల‌కం. ఈ క్రమంలోనే జ‌గ‌న్ ఈ రెండు వ‌ర్గాల‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి టీడీపీకి క్షత్రియ బ‌లం పెద్దగా లేదు. అయాతే డెల్టాతో పాటు తూర్పులో కోన‌సీమ‌లోనూ రాజ‌కీయాన్ని శాసించేది క్షత్రియులే. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. క్షత్రియ వ‌ర్గానికి అత్యంత ప్రాధాన్యం పెంచారు.

బీసీలకు కూడా….

ఈ వ‌ర్గానికే చెందిన చెరుకువాడ శ్రీరంగ‌నాథ ‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇక‌, జ‌గ‌న్ త‌న స‌న్నిహితుడు, వైసీపీని బ‌లంగా ముందుకు తీసుకువెళ్లిన నాయ‌కుడు ముదునూరు ప్రసాద‌రాజుకు కూడా రాబోయే రోజుల్లో కేబినెట్ లో బెర్త్ ఇవ్వనున్నారు. ఇక‌, బీసీల‌కు ప్రాధాన్యం పెంచారు. శెట్టిబ‌లిజ‌కు చెందిన కౌరు శ్రీనివాస్‌కు డీసీసీబీ చైర్మన్‌, పాల‌కొల్లు ఇంచార్జ్ ప‌ద‌వి ఇచ్చారు. ఇక జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత చైర్మన్ ప‌ద‌వి సైతం కౌరు శ్రీనుకే ద‌క్క‌నుంది. ఇక బీసీ వ‌ర్గానికే చెందిన య‌డ్ల తాతాజీకీ డీసీఎస్ఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు.

టీడీపీకి చెక్ పెట్టేందుకు….

ఇలా మెట్టలో టీడీపీకి ముందు నుంచి వెన్నుద‌న్నుగా ఉన్న క‌మ్మ వ‌ర్గాన్ని తన వైపున‌కు తిప్పుకునే క్రమంలో అబ్బయ్య చౌద‌రికి ప్రయార్టీ ఇస్తుండ‌డంతో పాటు మెట్టలో మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క ప‌ద‌వులు వారికే క‌ట్టబెడుతోన్న జ‌గ‌న్‌… డెల్టాలో బీసీ + క్షత్రియ కాంబినేష‌న్‌తో ముందుకు వెళుతున్నారు. ఇలా జ‌గ‌న్ టీడీపీకి చెక్ పెట్టే క్రమంలో ప‌శ్చిమ‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి ప్రతిగా టీడీపీ ఎలా ?ముందుకు సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News