సడలింపులపై జగన్ కసరత్తులు.. సాధ్యమయ్యేనా?

మే 3వ తేదీ తర్వాత ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వాలని యోచిస్తుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. [more]

Update: 2020-04-30 12:30 GMT

మే 3వ తేదీ తర్వాత ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇవ్వాలని యోచిస్తుంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి సడలింపులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా గ్రీన్ జోన్లలో పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. గ్రీన్ జోన్ ఉన్న ప్రాంతాల్లో ప్రజా రవాణాను కూడా మొదలుపెడితే ఎలా ఉంటుందన్న దానిపై జగన్ అధికారులతో చర్చించారు.

నలభై రోజులుగా….

గత నలబై రోజులుగా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 676 మండలాలు ఉన్నాయి. వీటిలో 559 మండలాలు కరోనా రహిత మండలాలుగా ఉన్నాయి. రెడ్ జోన్ లో 63 మండలాలు, గ్రీన్ జోన్ లో 54 మండలాలు ఉన్నాయి. జిల్లాల పరంగా తీసుకుంటే ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో 11 జిల్లాల్లో కోరోనా వైరస్ ఉంది. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

గ్రీన్ జోన్లలో….

జగన్ ఇటీవల మీడియా సమావేశంలో కూడా పరోక్షంగా గ్రీన్ జోన్లలో ప్రజాజీవనాన్ని పునరుద్ధరించాలని చెప్పారు. అంటే గ్రీన్ జోన్లలో పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలకు మే 3వ తేదీ తర్వాత సిద్ధం చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మండలాల వారీగా వాటిలో అన్ని రకాల వ్యాపారాలను, పరిశ్రమలను ప్రారంభిస్తే రాష్ట్రానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. పేద,మధ్య తరగతి జీవులకు ఉపాధి దొరుకుతుంది.

వీటికి మాత్రం….

అయితే హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వైన్ షాపులు, మంగలి షాపులు, సినిమా హాళ్లకు మాత్రం గ్రీన్ జోన్లలో కూడా మినహాయింపు ఇవ్వకూడదని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని దుకాణాలు స్వీట్ షాపులతో సహా తెరుచుకునేలా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తుంది. అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల మధ్య రవాణా మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని భావిస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

Tags:    

Similar News