అంతా సిద్ధమేనట.. ఎలాగైనా రెడీ అయిపోవాల్సిందేనట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆయన [more]

Update: 2020-05-04 05:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఆయన దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు. మే నెలాఖరుకు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశముంది. వీలయితే జూన్ మాసం ప్రారంభంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమయినట్లు కన్పిస్తుంది.

కార్యచరణకు ….

దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైన కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమై ఎన్నికలపై సమీక్షించారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన వెంటనే నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించినట్లు తెలిసింది.

మార్గదర్శకాలు తయారీ….

ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ తగ్గినా పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లను కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. వైరస్ తగ్గుముఖం పట్టినా పోలింగ్ కేంద్రాల్లో సోషల్ డిస్టెన్స్ ను పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ఎ్నికల సంఘం భావిస్తుంది. పోలింగ్ కేంద్రాలను పెంచినందున రద్దీ తగ్గే అవకాశముంది.

పోలింగ్ కేంద్రాల పెంపు.. టైమ్ స్లాట్…..

అంతేకాకుండా ప్రతి ఓటరుకు ఓటింగ్ కు టైమ్ కేటాయించడంపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టిపెట్టింది. పోలింగ్ కేంద్రానికి ఒక గంటకు యాభై మంది ఓటర్లు మించకుండా టైమ్ అడ్జస్ట్ అయ్యేలా స్లాట్ కేటాయించడంపై సాధ్యాసాధ్యాలను కూడా ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ లతోనే పోలింగ్ కేంద్రాలకు రావాల్సి ఉంటుందన్న నిబందన కూడా విధించే అవకాశముందంటున్నారు. మొత్తం మీద మే చివరినాటికి గాని, జూన్ మొదటి వారంలో గాని జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశముందని సమచారం.

Tags:    

Similar News