ఇరుక్కు పోయారా? బయటపడే అవకాశముందా?

రాజధాని తరలింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం లేదని హైకోర్టుకు తెలపడంతో జగన్ వ్యూహం ఏమైఉంటుందన్న చర్చ జరుగుతోంది. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ [more]

Update: 2020-04-25 06:30 GMT

రాజధాని తరలింపు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం లేదని హైకోర్టుకు తెలపడంతో జగన్ వ్యూహం ఏమైఉంటుందన్న చర్చ జరుగుతోంది. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం తరుపున ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రమాణ పత్రాన్ని కూడా పది రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ రాజధాని విషయంలో ఈ ఏడాది వెనక్కు తగ్గినట్లేనా? అన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ నెలలోనే తరలించాలని…..

నిజానికి ఏప్రిల్ నెలలోనే సచివాలయాన్ని విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే కరోనా వైరస్ రాకతో దానిని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సచివాలయం ఉద్యోగులు మే నెల దాటితే విశాఖకు వెళ్లేందుకు సుముఖంగా లేరు. జూన్ నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయి కాబట్టి మే నెలలోనే విశాఖకు షిష్టింగ్ పెట్టుకోవాలని సచివాలయ ఉద్యోగులు సయితం ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు విశాఖలో కార్యాలయాల ఏర్పాట్లు కూడా చకా చకా జరిగిపోతున్నాయి.

బిల్లులు పాస్ కాకుండా..?

అయితే హైకోర్టులో వాదనల సందర్భంగా బిల్లులు పాస్ కాకుండా ఎలా రాజధానిని తరలిస్తారంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేసింది. అధికార వికేంద్రీకరణ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. శాసనమండలిలో దీనిని సెలెక్ట్ కమిటీకి పంపింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం శాసనమండలి రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో మండలి లైవ్ లోనే ఉంది. ఈ బిల్లులు పాస్ కాకుండా రాజధానిని తరలిస్తే హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పవు.

పది రోజుల్లో ఏం చెబుతోంది?

బిల్లులు పాస్ అయ్యే మార్గం ఇప్పట్లో కన్పించడం లేదు. కరోనా వైరస్ కారణంగా ఉభయ సభలు మళ్లీ సమావేశమయ్యే అవకాశం లేదు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపి నాలుగు నెలలు పైగానే అవుతుంది. కరోనా కారణంగా ఇటీవల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా జరగలేదు. బిల్లులు పాస్ అయ్యే వరకూ ప్రమాణ పత్రం సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరడంతో ఇరుకున పడినట్లయింది. ప్రమాణ పత్రం సమర్పిస్తే బిల్లులు పాస్ అయ్యేంత వరకూ రాజధాని ప్రక్రియ నిలిపి వేయాల్సిందే. మరి జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News