జగన్ కు ఎందుకిలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి. సీబీఐ పట్టుబట్టి మరీ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ [more]

Update: 2019-11-01 08:00 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు అన్ని రకాలుగా ఇబ్బందులే ఉంటాయి. సీబీఐ పట్టుబట్టి మరీ జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ కొట్టివేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం జగన్ ను టార్గెట్ చేసిందా? కేసుల ఉచ్చులో జగన్ ను బిగించేందుకు సిద్ధమవుతుందా? అన్న అనుమానాలు వైసీపీ నేతల్లోనూ కలుగుతున్నాయి.

2011 నుంచి ఈ కేసు….

వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. 2011 లో నమోదయిన ఈ కేసులో వైఎస్ జగన్ 14 నెలల జైలు శిక్షను కూడా అనుభవించారు. తర్వాత బెయిల్ మంజూరయింది. అనేక కేసులకు సంబంధించి జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతూ వస్తున్నారు. జగన్ ఎన్నికలకు ముందు జరిపిన పాదయాత్ర సమయంలోనూ తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరినా అందుకు అంగీకరించలేదు. దీంతో పాదయాత్ర జరిగిన ఏడాది మొత్తం మధ్యలో యాత్రను ఆపి జగన్ కోర్టుకు హాజరయ్యే వారు.

ముఖ్యమంత్రి కావడంతో….

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న జగన్ ప్రతి వారం కోర్టుకు హాజరయితే పాలన వ్యవహారాలు కుంటుపడే అవకాశముంది. జగన్ ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా భద్రత సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి అయ్యే ముందు వరకూ జగన్ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేవారు.

కేంద్రం వత్తిడితోనేనా..?

జగన్ దాఖలు చేసిన పిటీషన్ కు సీబీఐ కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది. సమర్థవంతంగా వాదనలు విన్పించింది. సీబీఐ పట్టుబట్టడాన్ని చూస్తే జగన్ ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్నంగా ఉందని అర్థమవుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్ తో జగన్ సత్సంబంధాలు నెరపడం, బీజేపీ నేతలను వైసీపీలోకి చేర్చుకోవడం, ఏపీలో బీజేపీ బలపడాలంటే జగన్ ను మానసికంగా దెబ్బతీయడం ఒక్కటే మార్గమని బీజేపీ భావించడమే కారణమని చెబుతున్నారు. సీబీఐ కోర్టు జగన్ పిటీషన్ కొట్టివేయడంతో టీడీపీ నేతలు స్వరం పెంచారు. జగన్ కోర్టు ఖర్చులను ప్రభుత్వం భరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన కోర్టు ఖర్చులను సొంతంగా భరించాల్సి ఉంటుందని యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని కాల్వ శ్రీనివాసులు అన్నారు. మొత్తం మీద సీబీఐ వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News