ముందుండి నడిపించేది మూడో రకం బ్యాచేనట?

కొంద‌రు చెప్పింది విని చేస్తారు. మ‌రికొంద‌రు త‌మ‌కు తెలిసింది చెబుతారు. ఇంకొంద‌రు మాత్రం చెప్పింది విని, త‌మ ఆలోచ‌న‌ల‌ను కూడా జోడించి వ్యవ‌హ‌రిస్తారు. ఈ మూడో రకం [more]

Update: 2020-04-20 14:30 GMT

కొంద‌రు చెప్పింది విని చేస్తారు. మ‌రికొంద‌రు త‌మ‌కు తెలిసింది చెబుతారు. ఇంకొంద‌రు మాత్రం చెప్పింది విని, త‌మ ఆలోచ‌న‌ల‌ను కూడా జోడించి వ్యవ‌హ‌రిస్తారు. ఈ మూడో రకం బ్యాచ్ వ‌ల్ల.. స‌త్ఫలితాలు వ‌స్తాయ న‌డంలో సందేహం ఎందుకు? ఇప్పుడు ఏపీలోనూ ప్రభుత్వ ప‌నుల్లో ఈ మూడో బ్యాచ్ వ‌ల్లే చాలా వ‌ర‌కు ప‌నులు జ‌రుగుతున్నాయి. సీఎంగా జ‌గ‌న్ ఆలోచ‌న‌లు తెలిసిన‌వే. ప్రజ‌ల ప‌క్షాన ఉంటూనే పార్టీ లైన్ ప్రకారం ప‌నులు చేసుకుంటూ ముందుకు సాగుతుండ‌డం. ఈ క్రమంలో పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో .. దానిని కీల‌కంగా భావించి.. దానిని అమ‌లు చేయ‌డం. ఈ విష‌యంలో సీఎంగా జ‌గ‌న్ ఎక్కడా రాజీ ప‌డ‌డం లేదు.

ప్రభుత్వాన్ని వెనక నుంచి…..

అయితే జగన్ ఒక్కరే కార్యక్ర‌మాలు న‌డిపించే సాహ‌సం చేయ‌గ‌ల‌రా ? అంటే.. అది భిన్నమ‌నే చెప్పాలి. మ‌రి ఈ ప్రభుత్వ నిర్ణయాల‌ను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉన్న టీం నిర్మాణాత్మకంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది వాస్తవం. ఇదే ఇప్పుడు జ‌గ‌న్ కు అనుకూలంగా మారింది. ఇటు మంత్రుల ప‌రంగాను, అటు అధికారుల ప‌రంగాను కూడా తెర‌వెనుక సార‌ధులు ఉండి చేస్తున్న ప‌నులు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయ‌ని అంటున్నారు. వీరిలో స‌ల‌హాదారులు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.

నడిపించేది వీరే…..

రాజ‌కీయంగా చూస్తే.. కీల‌క‌మైన మంత్రి స్థానాల్లో ఉన్న కుర‌సాల క‌న్నబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆళ్ల నాని, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేక‌పాటి గౌతంరెడ్డి.. వంటి వారు పూర్తిగా జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స‌ల‌హాదారులు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి కీల‌కంగా మారారు. గ‌తంలో మీడియాలో చేసిన అనుభ‌వం ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న ప్రభుత్వ విధానాల‌కు అనుగుణంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, సీఎస్ సాహ్ని, డీజీపీ స‌వాంగ్‌, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి.. వంటివారు ప్రభుత్వ విధానాల‌ను ముఖ్యంగా జ‌గ‌న్ విధానాల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు.

గతం కంటే భిన్నంగా…..

ఈ క్రమంలోనే ఆయ‌న విధానాల‌కు అనుగుణంగా ఒక‌వైపు కార్యాచ‌ర‌ణ చేస్తూనే మ‌రోవైపు.. కార్యక్రమ రూప‌క‌ల్పన‌లోనూ కీల‌కంగా ఉన్నారు. అందుకే వీరిని ప్రభుత్వ సార‌ధులుగా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. గ‌తంలో చంద్రబాబు పాల‌న‌తో పోల్చిన‌ప్పుడు అంతా ఒక్కటే సీటు నుంచి నిర్ణయాలు జ‌రిగాయి. అంతా ఒక్కరే మీడియాలో ఫోక‌స్ అయ్యారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క‌రూ ఫోక‌స్ అవుతున్నారు. ఇదే ఇప్పుడు వారిలో అచంచ‌ల‌మైన మ‌నోస్థయిర్యం క‌ల్పిస్తూ.. ముందుకు సాగేలా చేస్తున్నది. అందుకే ఈ టీం.. స‌క్సెస్ అయింది.

జిల్లాల వారీగా బాధ్యతలు…

ఇక జిల్లాల వారీగా కూడా పార్టీ బాధ్యత‌ల‌ను ప్రాంతాల వారీగా ఏరియాల వారీగా విజ‌యసాయిరెడ్డి, వైవి.సుబ్బారెడ్డి, స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాక‌ర్ రెడ్డి, మిథున్‌రెడ్డి లాంటి వాళ్లకు బాధ్యత‌లు అప్పగించ‌గా.. వారు కూడా జిల్లాల్లో పార్టీని తిరుగులేని విధంగా ప‌టిష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వ ప‌రంగా, ఇటు పార్టీ ప‌రంగా జ‌గ‌న్‌కు తిరుగులేని బ‌ల‌మైన నేత‌లు ఉండ‌డంతో జ‌గ‌న్‌కు పెద్ద రిలాక్స్ అనే చెప్పాలి.

Tags:    

Similar News