తప్పుకాకపోయినా… తప్పనిసరిగా భరించాల్సిందేనా?

అధికార పార్టీకి చెందిన వారికి కరోనా అగ్ని పరీక్ష పెట్టింది. దీన్ని కంట్రోల్ చేయడంలోనే సమర్థత బయటకు కన్పిస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంట ిరాష్ట్రాల్లో అప్పుడే [more]

Update: 2020-04-20 00:30 GMT

అధికార పార్టీకి చెందిన వారికి కరోనా అగ్ని పరీక్ష పెట్టింది. దీన్ని కంట్రోల్ చేయడంలోనే సమర్థత బయటకు కన్పిస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంట ిరాష్ట్రాల్లో అప్పుడే ముఖ్యమంత్రుల సమర్థత చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో పాలన పూర్తిగా ఆయన చేతిలో ఉండదు కాబట్టి కొంత అరవింద్ కేజ్రీవాల్ కు ఊరటే. ఇక మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రలయితే ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రజల్లో కూడా వీరి సమర్థతపై అనుమానాలు కలుగుతాయి. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి కూడా అదే.

కరోనాను కంట్రోల్ చేయలేకపోతే?

కరోనా ను కంట్రోల్ చేయడంలోనే జగన్ ప్రభుత్వం సఫలమయితే కొంత ఆయనకు, ఆయన ప్రభుత్వానికి ఊరటే. రోజురోజుకూ కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఊహించని విధంగా పెరుగుతూ వస్తుంది. ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వ కృషిని జాతీయ మీడియా ప్రశంసిస్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు ఏవిథంగా తీసుకుంటోరన్న టెన్షన్ అధికార పార్టీ నేతల్లో అయితే స్పష్టంగా కన్పిస్తుంది.

ప్రజలతో ముడిపడిన సమస్య….

కరోనాను కట్టడి చేయడం ఎవరి వల్లా కాదు. ప్రజలతో ముడిపడి ఉన్న సమస్య. ఈ విష‍యం అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా నిత్యావసర వస్తువుల కోసం ఇస్తున్న సడలింపు సమయాన్ని ప్రజలే దుర్వినియోగం చేస్తున్నారు. అప్పటికీ ఎక్కడా లేని విధంగా ఏపీలో కేవలం మూడు గంటల సమయం మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ముఖ్యంగా రాజధాని పక్కనే ఉన్న గుంటూరు జిల్లా కరోనా విషయంలో ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది.

విపక్షాలు ఇప్పటికే…..

మర్కజ్ మసీదు ప్రార్థనల తర్వాత ఏపీలో కేసుల సంఖ్య పెరిగిందన్నది వాస్తవమే. కానీ విపక్షాలు ఇప్పటికే జగన్ ప్రభుత్వం కరోనాను సరిగ్గా కంట్రోలు చేయలేకపోయిందని విమర్శలు ప్రారంభించాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సయితం కరోనా బారిన పడటం ఆందోలన కల్గించే అంశమే. మొత్తం మీద కరోనాను సరిగ్గా కట్టడి చేయలేకుంటే జగన్ ప్రభుత్వం పట్ల జనాల్లో కొంత వ్యతిరేక భావం ఏర్పడుతుందన్నది మాత్రం వాస్తవం. ఈ తప్పు ఆయనది కాకపోయినా భరించాల్సి ఉంటుంది. మరి జగన్ కరోనా గండం నుంచి బయటపడతారా? లేదా? అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది.

Tags:    

Similar News