కష్టకాలంలోనూ కీలక విషయాల్లో మాత్రం?

కష్టకాలంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం జగన్ [more]

Update: 2020-04-10 05:00 GMT

కష్టకాలంలోనూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేయడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం జగన్ వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే ఖజానా ఖాళీ అవ్వడంతో ఉద్యోగుల వేతనాలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. వాయిదా పద్ధతుల్లో ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల వాయిదాపై విమర్శలు విన్పిస్తున్నా పేదల విషయంలో మాత్రం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా…..

జగన్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థిితి ఏమాత్రం బాగాలేదు. దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు మిగిలి ఉన్నాయి. అయినా సంక్షేమ పథకాలను మాత్రం జగన్ ప్రకటించుకుంటూ వెళ్లారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద రెండు వేల కోట్ల నిధులను జగన్ విడుదల చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై వత్తిడి ఉండకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలుస్తానన్న మాటను జగన్ నిలబెట్టుకున్నారు.

ఆరోగ్య శ్రీకి కూడా….

ఇక ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా జగన్ నిర్లక్ష్యం చేయలేదు. ఆరోగ్య శ్రీకి దాదాపు పదిహేను వందల కోట్లను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది జగన్ ఆకాంక్ష. ఇందుకోసం అన్ని జిల్లాల్లో భూ సమీకరణ చేయాలని జగన్ ఆదేశించారు. ఇందుకోసం 1600 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. వీలయినంత త్వరగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని జగన్ భావిస్తున్నారు.

నాయీ బ్రాహ్మణులకు….

రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో పనిచేేసే నాయి బ్రాహ్మణులకు పదివేల రూపాయలు అడ్వాన్స్ కింద ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు ఈ అడ్వాన్స్ ఇవ్వనున్నారు. మొత్తం వెయ్యి మంది వరకూ అడ్వాన్స్ కింద పదివేల రూపాయలను ప్రభుత్వం నుంచి పొందనున్నారు. తర్వాత వీరి నుంచి వాయిదా పద్ధతిలో ప్రభుత్వం తీసుకోనుంది. మొత్తం మీద జగన్ కష్టకాలంలో ఉన్నప్పటికీ కీలక విషయాలను మాత్రం విస్మరించకుండా నిధులను విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News