లౌక్యం లేకపోవడం వల్లనే అసలు సమస్య అట

జగన్ ప్రత్యేకమైన నాయకుడు. ఆయన ఒక పట్టాన అర్ధం కారు. ప్రపంచం అంతా ఓ వైపు ఉంటే జగన్ మరో వైపు ఉన్నట్లుగా ఉంటారు. ఆయన ఇపుడు [more]

Update: 2020-04-06 02:00 GMT

జగన్ ప్రత్యేకమైన నాయకుడు. ఆయన ఒక పట్టాన అర్ధం కారు. ప్రపంచం అంతా ఓ వైపు ఉంటే జగన్ మరో వైపు ఉన్నట్లుగా ఉంటారు. ఆయన ఇపుడు కరనా వైరస్ విషయంలో చేస్తున్న కామెంట్స్ జనాల్లో పెద్ద చర్చగా ఉన్నాయి. దానికి ఆజ్యం పోసేందుకు ఎటూ విపక్ష టీడీపీ రెడీగా ఉంటుంది. జగన్ కి ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదు, అందుకే ఆయన కరోనా వైరస్ గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారని తమ్ముళ్ళు గట్టిగానే అంటున్నారు. కరోనా వైరస్ ఇపుడు ఏపీలో కీలక దశకు చేరుకుంది. అయినా జగన్ చాలా లైట్ తీసుకోమంటున్నారు.

వట్టి జ్వరమేనా…?

అన్ని ఫ్లూల మాదిరిగానే కరోనా వైరస్ కూడా. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని జగన్ అంటున్నారు. జ్వరంలా వస్తుందని, కంగారు పడవద్దని జగన్ చెబుతున్న మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారి అలాంటిది ఇలాంటిది కాదని రెండు వందల దేశాలకు పైగా అది పాకిక సోకిన తీరు ఓ వైపు చెబుతోంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా వేలల్లో మరణాలు రికార్డ్ అవుతున్నాయి. భారత్ లో తీసుకున్న సెంచరీ కోసం మరణాల రేటు పరుగులు పెడుతోంది. ఇటువంటి స్థితిలో జగన్ ఇలా అనడం అనడం ద్వారా కోరి వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది.

ధైర్యం మంచిదే కానీ….

మన దేశంలో ప్రజల తీరు వేరు. ధైర్యం చెప్పడం వరకూ మంచిదే కానీ, చైతన్యంతో కూడిన ధైర్యం అవసరం. జనాల్లో కరోనా వైరస్ మీద ఇప్పటికీ సరైన అవగాహన లేదు. దాని వల్ల భయపెట్టి వారిని ఇళ్ళల్లో ఉంచడమే మంచిదని అంతా అంటారు. మన వాళ్ళకు అదిగో పులి అని చెప్పకూడదు, పులి ఎదురుగానే ఉందని చెప్పాలి. దాంతోనే వారు దారికి వస్తారు. కానీ కరోనా వల్ల ఏమీ కాదు అని ప్రభుత్వ పెద్దలే చెబితే జనాలు ఇంకా బేఖాతరు చేస్తారు. అపుడు సామాజిక దూరం చెరిగిపోయి అసలైన సమస్యలు ఎదురవుతాయని వైద్య రంగ నిపుణులు అంటున్నారు.

నియంత్రణ కోసం….

జగన్ చెబుతున్న మంచి మాటలు అర్ధం చేసుకోదగినవే. కరోనా వైరస్ వల్ల ఎక్కువగా ప్రాణాపాయం లేదని ప్రపంచంలో నమోదు అవుతున్న కేసులు, మరణాల నిష్పత్తిని చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. అయినంత మాత్రమ కరోనా ప్రమాదకారి కాదని ఎవరూ గట్టిగా చెప్పలేరు. ఎందుకంటే ఎవరి నుంచి ఎవరిని అంటుకుంటుందో తెలియదు. ఎక్కువగా రోగ నిరోధక శక్తి లేనివారినే అది ఇబ్బంది పెడుతుంది. మరి కట్టడి లేకపోతే వారే ఎక్కువగా బలి అవుతారన్నది వాస్తవం. అందువల్ల జగన్ నిజాలు చెప్పడం మంచిదే కానీ లౌక్యంగా జనాలకు కొంత భయం ఉంచకపోతే కరోనా వంటి సామాజిక అంటువ్యాధిని అదుపు చేయడం కష్టమన్న భావన మేధావుల్లో ఉంది. మొత్తానికి లోకమంతా కరోనా విషయంలో తాము భయపెడుతూ జనాలను భయపెడుతూంటే జగన్ మాత్రం ఏం ఫరవాలేదనడం మాత్రం చర్చకు తావిస్తోంది.

Tags:    

Similar News