రచ్చ గెలిచాడు.. ఆలోచన అక్కరకు వచ్చింది

ఆనాడు నిర్ణయం తీసుకున్నపుడు బహుశా జగన్ కి కూడా ఈ వ్యవస్థ బలం తెలిసి ఉండదేమో. కానీ కేవలం పది నెలల వ్యవధిలోనే జగన్ కి గ్రామ [more]

Update: 2020-03-28 13:30 GMT

ఆనాడు నిర్ణయం తీసుకున్నపుడు బహుశా జగన్ కి కూడా ఈ వ్యవస్థ బలం తెలిసి ఉండదేమో. కానీ కేవలం పది నెలల వ్యవధిలోనే జగన్ కి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ బాగా అక్కరకు వచ్చింది. జగన్ గత ఆగస్ట్ లో రెండున్నర లక్షల మంది గ్రామ, పట్టణ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఇపుడు ఆ వ్యవస్థ క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉంటూ జగన్ సర్కార్ కి అండగా ఉంటోంది. అందువల్లనే ఏపీలో కరోనా కేసులు పెద్దగా లేవన్న మాట కూడా వినిపిస్తోంది. ప్రతీ యాభై మంది ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉండడం వల్ల విదేశాల నుంచి ఎవరి వచ్చినా కూడా వారి వివరాలను తెలుసుకోవడం కొంతవరకూ సులభం అవుతోంది. ఓ విధంగా ఇంత సూక్ష్మ స్థాయిలో జ‌ల్లెడ పెట్టి గాలించే వ్యవస్థ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు లేదని చెప్పాలి.

వారికి ఆదర్శమా…?

ఇపుడు కరోనా వైరస్ తో విలవిల్లాడుతున్న దేశాలలో బ్రిటన్ ఒకటి. వారు ఇపుడు ఒక్కసారిగా అప్రమత్తం అవుతున్నారు. దిగువ స్థాయిలో పాలనా వ్యవస్థను గట్టిపరచుకునేందుకు జగన్ ఏపీలో చేసినట్లుగానే దేశ‌వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్ల కోసం అర్జంట్ గా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇది నిజంగా జగన్ సాధించిన విజయంగానే చెప్పుకోవాలి. ప్రభుత్వం ప్రతి ఇంటి ముంగిటకు వెళ్ళాల్సిన అవసరాన్ని కరోనా ప్రపంచ దేశాకు గట్టిగా నొక్కి చెప్పింది. దాంతో బ్రిటన్ ఆ దిశగా చర్యలను వేగవంతం చేసిందంటున్నారు.

పట్టుబడుతున్నారుగా…?

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటీర్ల పాత్ర ఎక్కువగానే కనిపిస్తోంది. కచ్చితంగా వివరాలు చెప్పేవారు ఉంటే మాత్రం వాలంటీర్లకు సరైన డేటా విరివిగానే దొరుకుతోంది. దానిని ఆసగారా చేసుకుని ఇతర విభాగాలు పరుగులు పెడుతూ వారిని క్వారంటైన్ కి తరలిస్తున్నారు. ఓ విధంగా ఇది చాలావరకూ ప్రభుత్వానికి పారదర్శకమైన సమాచారాన్ని అందిస్తోందనుకోవాలి.

అనుసంధానమే…..

పాలన అంటే ఎక్కడో దూరంగా ఉండి చేస్తూంటారు. ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తే దాని ఫలితాలు వచ్చేసరికి గరిష్టమైన సమయం తీసుకుంటుంది. అటువంటి సమయంలో అనుసంధానంగా వాలంటీర్ల వ్యవస్థ ఉపకరిస్తోందని అంటున్నారు. వారి పరిధి, పరిమితి బాగా తక్కువగా ఉండడం వల్ల రెగ్యులర్ గా ప్రతీ ఇంటినీ గుర్తు పెట్టుకుని మరీ అటు సర్కార్ కి ఇటు ప్రజలకు వారధిగా ఈ వ్యవస్థ ఉన్నది అనడంలో సందేహం లేదు. అయితే ఏపీలొ ఈ వాలంటీర్ల వ్యవస్థ మరింత సమర్ధంగా పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉందని సూచనలు వస్తున్నాయి. దాన్ని జగన్ ప్రభుత్వం కూడా సీరియస్ గా పరిశీలించాలి.

Tags:    

Similar News