ఓర్పు-స‌హ‌నం-జ‌గ‌న్‌కు మ‌రో గెలుపు.. ఎలాగంటే?

గత ఏడాది ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సొంతం చేసుకుని అప్రతిహ‌త సంఖ్యా బ‌లంతో అసెంబ్లీలో కొలువుదీరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రో విజ‌యం [more]

Update: 2020-03-29 12:30 GMT

గత ఏడాది ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సొంతం చేసుకుని అప్రతిహ‌త సంఖ్యా బ‌లంతో అసెంబ్లీలో కొలువుదీరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రో విజ‌యం ద‌క్కేందుకు ఆట్టే స‌మయం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే, ఈ విజ‌యం సొంతం చేసుకునేందుకు ఒకింత ఓర్పు, మరికొంత స‌హ‌నం అవ‌స‌ర‌మ‌ని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వైసీపీలో ఎంతో మంది నాయ‌కులు జ‌గ‌న్ కోసం ఎంతో శ్రమించారు. వారంతా జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌ని ఎన్నో క‌ల‌లు క‌న్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు వారంతా ఎంతో శ్రమించి ఆయ‌న కోసం క‌ష్టించారు.

అనేక మందికి హామీలు…

ఇలాంటి వారు గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మాట కోసం.. త‌మ సీట్లను సైతం త్యాగం చేశారు. అయితే, వీరికి జ‌గ‌న్ ఇచ్చిన హామీలు పెద్దగా నెర‌వేర‌లేదు. ముఖ్యంగా చాలా మంది నేత‌ల‌కు జ‌గ‌న్‌.. మండలిలో స‌భ్యత్వాలు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, దీనిని నెర‌వేర్చలేదు. ఈ క్రమంలోనే వారు మండ‌లిపై ఆశ‌లు పెట్టుకున్నారు. జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్రచారంలో ఓవ‌రాల్‌గా 30-40 మంది వ‌ర‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్లకు అయితే ఏకంగా ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని కూడా హామీ ఇచ్చారు.

మండలి రద్దు కావడంతో…

అయితే, మండ‌లిలో ప్రస్తుతం టీడీపీ ఆధిప‌త్యంతో ఉంది. ఈ పార్టీకి దాదాపు 26 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో చాలా మంది వ‌చ్చే ఏడాది అంటే 2021 నాటికి త‌మ ప‌ద‌వుల గ‌డువు తీర‌డంతో ప‌క్కకు త‌ప్పుకొంటారు. ఫ‌లితంగా ఆయా స్థానాల్లో మెజారిటీ స్థానాలు వైసీపీకి ద‌క్కుతాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు మండ‌లిపై ఆశ‌లు పెట్టుక‌న్నారు. అయితే, మండ‌లిని ర‌ద్దు చేస్తూ. జ‌గన్ నిర్ణయం తీసుకున్న క్రమంలో వారంతా స్తబ్దుగా ఉన్నారు. మండ‌లి ర‌ద్దుకు దారితీసిన ప‌రిస్థితులను గుర్తు చేసుకుని గోటితో పోయేదానికి మా వోడు గొడ్డలి చేసుకున్నాడు! అంటూ నిట్టూరుస్తున్నారు.

ఓర్పుగా ఉండి కేంద్రంతో మాట్లాడుకుంటే?

ఇంత‌లో జ‌గ‌న్‌కు మంచో చెడో .. మండ‌లి ర‌ద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వ‌ర‌కు కూడా తీసుకు వెళ్లలేదు. ఇప్పట్లో ఆ అవ‌కాశం లేదు. ఇక‌, ఆగ‌స్టులో కొలువుదీరే.. పార్లమెంటుతోనే అన్నీ చ‌క్కబ‌డ‌తాయి. అయితే.. అప్పటికి మ‌రో మూడు నాలుగు మాసాల్లో టీడీపీ స‌భ్యులు రిటైర్ అవుతారు. సో.. ఇప్పుడు జ‌గ‌న్ ఆవేశం త‌గ్గించుకుని ఒకింత ఓర్పు, స‌హ‌నంతో ఉంటే.. ప‌రిస్థితులు వైసీపీకి సానుకూలంగా ఉంటాయ‌ని, గ‌తంలో మాట ఇచ్చిన వారికి ప‌ద‌వులు ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంద‌ని, ఇది పార్టీ ప‌రంగా మ‌రో విజ‌యం అవుతుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News