నిజమే… జగన్ తప్పించుకోలేరు

ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధినేత ఇమేజ్ మీద ఆధారపడి నడుస్తుంది. ఆయన తీసుకునే నిర్ణయాల మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏ పార్టీ [more]

Update: 2020-03-27 14:30 GMT

ఏ ప్రాంతీయ పార్టీ అయినా అధినేత ఇమేజ్ మీద ఆధారపడి నడుస్తుంది. ఆయన తీసుకునే నిర్ణయాల మీదే పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇందులో ఏ పార్టీ అతీతం కాదు. చంద్రబాబు వల్లనే ఆ పార్టీ ఇంకా బతికి బట్టకలుగుతుంది. అలాగే జగన్ వల్లనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే ప్రతిపక్ష పార్టీకి ఇందులో కొంత వెసులుబాటు ఉంటుంది. నాయకత్వంతో పనిలేకున్నా అధికార పార్టీ మీద వచ్చే వ్యతిరేకతపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

నిర్ణయాలన్నింటికీ…..

ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారు. తాను తీసుకునే నిర్ణయాలకు ఆయనే బాధ్యుడు. ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించినట్లు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉండే వెసులుబాటు జగన్ కు లేదు. వైఎస్ తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వెలువడితే హైకమాండ్ పైకి నెట్టేసే వీలుంది. అలాగే వైఎస్ సీనియర్ నేతలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే వారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాలు వైఎస్ నేతలతో సమాలోచనల ద్వారా పుట్టుకొచ్చినవే.

పార్టీపైనే ప్రభావం….

కానీ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా పార్టీపై ప్రభావం చూపక మానవు. ఇందులో ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఏమాత్రం సంబంధం లేదు. మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ ను చూసి ఓటేశారు కాని ఎమ్మెల్యేలను చూసి కాదన్నది అందరికీ తెలసిందే. ఒకవేళ జగన్ ఇమేజ్ పడిపోతే ఇప్పుడు గెలిచిన వాళ్లలో ముఫ్పావు మంది ఎమ్మెల్యేలు గెలవడమూ కష్టమే. అందుకే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన పార్టీ భవిష్యత్ పైనే ఆధారపడి ఉంటుంది.

చేర్చుకోవడం ద్వారా…..

మూడు రాజధానులు, మండలి రద్దు అంశం వంటివి ఇప్పటి వరకూ జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు. ఈ రెండు నిర్ణయాల వల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనను ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు స్వాగతిస్తున్నారు. ఇక మండలి రద్దు ప్రజలకు సంబంధం లేనిది. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఉపయోగపడేలా ఉండాలంటున్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్నారు. కొత్త వారి చేరికతో భవిష్యత్తులో నియోజకవర్గాల్లో తలెత్తే ఇబ్బందులకు జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News