స్క్రిప్ట్ లేనిదే చదవలేకపోతున్నాడేందమ్మా?

ఇంట్లో బియ్యం అయిపోయాయి….. రాత్రి నిద్ర పోయే ముందు విన్న చివరి మాట…. ఒక్కసారిగా బీపీ వచ్చినా., ఆ టైం లో అరవడం ఇష్టం లేక కళ్ళు [more]

Update: 2020-03-25 03:30 GMT

ఇంట్లో బియ్యం అయిపోయాయి….. రాత్రి నిద్ర పోయే ముందు విన్న చివరి మాట…. ఒక్కసారిగా బీపీ వచ్చినా., ఆ టైం లో అరవడం ఇష్టం లేక కళ్ళు మూసుకున్నా….ఉదయం నిద్ర లేవగానే గబగబా తయారై రోడ్డు మీదకి వచ్చా….. ఆరు-ఆరున్నర అయ్యి ఉంటుంది….. మెట్రో దగ్గర్లో ఉండే బియ్యం కొట్టు తీసే ఉంది…. తెలిసిన కుర్రాడు తీరిగ్గా టీవీ చూస్తున్నాడు. వాడి షాప్ తెరిచి ఉండటం, తెలిసిన వాడే కావడంతో కాస్త రిలీఫ్ అనిపించింది. కాసేపు కూర్చోమంటే కూర్చుని టీవీ చూస్తున్నా, ఎంతైనా కేసీఆర్ మగాడన్న అన్నాడు ఉన్నట్టుండి…. సూపర్ మాట్లాడతాడు…. భలే ఉంటాయి మాటలు అన్నాడు

ఆయన వెనకే పోతూ….

అందులో ఏముంది తమ్ముడు అంత ఇదిగా అన్నా…. వాడి ఉద్దేశం తెలుసుకోవాలని…… సుత్తి ఉండదు…. వినాలి అనిపిస్తుంది అన్నా అన్నాడు…. ఏమైనా చేస్తే అలా చేయాలి అన్నాడు. –చ్చ పోయిస్తాడు…. ఇక్కడ కూడా చేస్తున్నారుగా అన్నా….!ఇంకా బాగా అంటే….. వాడు గట్టిగా నవ్వి ఆయన చేసినాకే కదా అన్నా ఈయన చేసేది…. ఆయన పావలా అంటే ఈయన 20పైసలు అంటాడు…. కొత్తగా ఏముంది…. ఆయన వెనుక పోవడం తప్ప…. నువ్వు మరీ టూమచ్ తమ్ముడు అన్నాను….కాస్త కోపంగా….. లేదన్న ఈయన టీవీలోకి కూడా రావాలా వద్దా అన్నట్టు ఉంటాడు….. ఎంటో లెక్క ఉంటాడు అన్నాడు. ఏదేదో చేస్తాడు అయినా మనకెందుకులే అన్నా అని బియ్యం మూట కాట మీద పెట్టాడు….. కార్డ్ స్వైప్ చేస్తూ….. నా ముఖంలోకి చూస్తూ కామ్ గా ఉండిపోయాడు. నాకు ఏమి మాట్లాడాలో తెలీక రైస్ బ్యాగ్స్ వెనుక పెట్టమని బయటకు వచ్చేసా!!

ఎన్నో బహిరంగ సభల్లో…..

నిజమే ఇది ఒక సీనియర్ జర్నలిస్ట్ కు విజయవాడలో జరిగిన స్వీయ అనుభవం. జగన్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వందలాది బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆయన ఎక్కడా ఎప్పుడూ తడబాటుకు లోను కాలేదు. స్క్రిప్ట్ కూడా చేతిలో పట్టుకోలేదు. కానీ చంద్రబాబుపైనా, నాటి ప్రభుత్వంపైన సూటి విమర్శలు చేసేవారు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక స్క్రిప్ట్ లేనిదే చెప్పలేక పోతున్నారు. రెండుసార్లు జరిగిన మీడియా సమావేశాల్లోనూ జగన్ లో కొంత తడబాటు కన్పించింది. స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ కంటే పేదలకు నగదు ఎక్కువగా ఇవ్వకపోయి ఉండవచ్చు. కానీ తాను అనుకున్నది, చేయదలచుకున్నదీ స్పష్టంగా జగన్ చెప్పలేకపోతున్నారనేది సుస్పష్టం. ఇదే ఏపీలో టాక్. కేసీఆర్ తో పోల్చలేం కాని జగన్ మునుపటిలా మాత్రం లేరనేది వాస్తవం.

క్లారిటీ ఇస్తేనే కదా?

ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. అదే పంథాలో జగన్ వెళుతున్నారమనుకున్నా.. వారు కీలక సమయాల్లో మాత్రం ప్రజలకు విషయాన్ని చేరవేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలకు తామే స్వయంగా చెప్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ జగన్ మాత్రం మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి కీలక అంశాలపై కూడా మీడియా సమావేశం పెట్టలేదు. తాను తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు. మొత్తం మీద జగన్, కేసీఆర్ ల మధ్య పోలికను ఏపీ జనం బాగానే చూస్తున్నారని పై సంఘటనను బట్టి తెలుస్తోంది.

Tags:    

Similar News