జగన్ కు ఇక నిరాశేనా?… ఎన్నాళ్లు వెయిటింగ్?

శాసనమండలి రద్దు ఇక ఇప్పట్లో లేనట్లే. పార్లెమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో శాసనమండలి రద్దు పై ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇప్పట్లో తీసుకునే [more]

Update: 2020-03-24 08:00 GMT

శాసనమండలి రద్దు ఇక ఇప్పట్లో లేనట్లే. పార్లెమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటంతో శాసనమండలి రద్దు పై ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. కరోనా వైరస్ తగ్గిన తర్వాత వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే శాసనమండలి రద్దు బిల్లు వచ్చే అవకాశముంది. అప్పటి వరకూ శాసనమండలి ఏపీలో ఉన్నట్లే. జగన్ హడావిడిగా చేసినా కరోనా వైరస్ దెబ్బకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు.

శాసనమండలి రద్దుతో…..

జగన్ శాసనమండలిని రద్దు చేశారు. జనవరి నెలలో అసెంబ్లీ సమావేశాలను పెట్టి శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులకు కూడా రాజ్యసభ స్థానాలకు ఎంపిక చేశారు. శాసనమండలి రద్దు అవుతుందనే జగన్ వారిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపిక కావడం ఖాయం కావడంతో వారిద్దరూ మంత్రిపదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.

రెండు సభలను….

మరోవైపు శాసనమండలి రద్దు మరికొంతకాలం వాయిదా పడినట్లే. మూడు రాజధానుల అంశం, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి వ్యతిరేకించడంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లులను పంపినా నాలుగు నెలల్లో తిరిగి ఆ బిల్లులు అసెంబ్లీకి వచ్చేవి. ఇప్పటికే మూడు నెలలు జరిగిపోయింది. అయితే జగన్ తెలుగుదేశం పార్టీ మీద ఆగ్రహంతో ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అది రివర్స్ లో జగన్ కే కొట్టిందనే చెప్పాలి.

సెలెక్ట్ కమిటీ విష‍యంలోనూ….

ఇక అసెంబ్లీ సమావేశాలను జరపాల్సి ఉంది. ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి ఆర్థిక బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉంది. రెండు సభలను జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనమండలి ఇప్పట్లో రద్దు కాదన్న అంశం వైసీపీలో చర్చకు దారితీసింది. టీడీపీ హ్యాపీగా ఉంది. ప్రస్తుతం శాసనమండలి కొనసాగనున్న నేపథ్యంలో సెలెక్ట్ కమిటీకి రెండు కీలక బిల్లుల విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడింది. ఇక వర్షాకాల సమావేశాలు వరకూ జగన్ పార్టీ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News