జగన్ గిల్టీగా ఫీలవుతున్నారా?

జగన్ ఇమేజ్ ఆకాశం అంటిందని, ఇప్పట్లో అది కిందకు దిగి రాదని వైసీపీ వీరాభిమానులు అంటూంటారు. మరో వైపు జగన్ సైతం అతి విశ్వాసంతోనే ఉన్నట్లుగా ఏపీ [more]

Update: 2020-03-27 02:00 GMT

జగన్ ఇమేజ్ ఆకాశం అంటిందని, ఇప్పట్లో అది కిందకు దిగి రాదని వైసీపీ వీరాభిమానులు అంటూంటారు. మరో వైపు జగన్ సైతం అతి విశ్వాసంతోనే ఉన్నట్లుగా ఏపీ పొలిటికల్ సీన్ ఉంది. ఇక జగన్ సంక్షేమ కార్యక్రమాలు బాగానే ప్రవేశపెట్టారు, అది తప్ప మిగిలిన పాలనంతా తప్పుల తడకగా ప్రతీ రోజూ కోర్టుల నుంచి చీవాట్లు, మొట్టికాయలు తింటూ సాగుతోంది. ఇక జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వాడుతున్న భాష సైతం జగన్ సర్కార్ ఇమేజ్ ని జనంలో దిగజార్చిందంటారు.

సెల్ఫ్ గోల్ ….

వీటన్నిటికీ మించి జగన్ సెల్ఫ్ గోల్ వేసుకోవడంతో సరిసాటి, ఆయనకు ఎవరూ రారు పోటీ అన్నది వాస్తవమని కూడా అంటారు. జగన్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో ఎంత యాగీ చేయాలో అంతా చేశారు. ఆఖరుకు చంద్రబాబు కులానికీ, ఎస్ఈసీ రమేష్ కుమార్ కులానికి అంటగట్టి ఏ ముఖ్యమంత్రి నోటి వెంట రాకూడని కులం మాటలు మాట్లాడారు. ఇక ఆయన మంత్రులు సైతం రెచ్చిపోయి ఒక సామాజికవర్గం మీద దుమ్మెత్తిపోశారు.

నిమ్మగడ్డే కరెక్టా….?

ఇపుడు ఏపీలో విస్తరిస్తున్న కరోనా వైరస్ ని పరిగణన‌లోకి తీసుకుంటే నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదా వేసి మంచి పని చేశారని వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు. లేకపోతే ఈ పాటికి ఎన్ని పాజిటివ్ కేసులు ఏపీలో కనిపించేవోనని కూడా అంటున్నారు. నిమ్మగడ్డ ఎవరిని సంప్రదించినా ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజు ఏపీ ఈ మాత్రం సేఫ్ గా ఉందని తటస్తులు దగ్గర నుంచి సామాన్యుల వరకూ వినిపిస్తున్న మాట. ఇక్కడ జగన్ చేసిన ఆరోప‌ణలు కానీ ఎన్నికల వాయిదా వెనుక కుట్ర కానీ ఎక్కడా కనిపించడంలేదని అంటున్నారు. నిమ్మగడ్డ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఏపీలో పరిస్థితి చేయి దాటిపోలేదని ఇతర రాష్ట్రాల వారు కూడా అంటున్న మాట. ఓ విధంగా జగన్, ఆయన మంత్రులు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డని కార్నర్ చేయడం పట్ల జనంలో వైసీపీపైన వ్యతిరేకత కూడా పెరుగుతోంది.

సరిగ్గా వ్యవహరించడం లేదని…

జగన్ లో ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కడో ఉందని, అందుకే ఆయన కరోనా వైరస్ సమీక్షలు కరెక్ట్ గా చేయడంలేదని విపక్ష టీడీపీ అంటోంది. ఈ విషయంలో వామపక్షాలే కాదు, వామపక్ష తీవ్రవాద సంస్థలు కూడా ఏపీలో కరోనా నియంత్రణ చర్యల విషయంలో జగన్ సరిగ్గా వ్యవహరించడం లేదని అంటున్నారు. కరోనా అనగానే జగన్ కి లోకల్ బాడీ ఎన్నికల వాయిదా గుర్తుకురావడంతోనే గిల్టీగా భావిస్తున్నారా అన్న డౌట్లూ వస్తున్నాయి. ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. ఇపుడు నిమ్మగడ్డ నిర్ణయం తీసుకుంటే ఆయన్ రైట్ వేలో వెళ్ళారన్నది అంతా అంటున్న మాట. ఇదే నిజమైన ప్రజా తీర్పు అయితే మళ్ళీ ఎన్నికలు జరిపినా జగన్ పార్టీకి 90 శాతం ఫలితాలు రావంటే రావేమో.

Tags:    

Similar News