జగన్ దానికి ఒకేనట… కానీ అలా జరిగిందట?

నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో దేవుడికే ఎరుక. కానీ అటు వైసీసీ, టు ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ రొచ్చులో ఇరుక్కున్నారు. ఫలితంగా రెండు రాజ్యాంగబధ్ధ వ్యవస్థల [more]

Update: 2020-03-22 15:30 GMT

నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో దేవుడికే ఎరుక. కానీ అటు వైసీసీ, టు ముఖ్యమంత్రి జగన్ ఇద్దరూ రొచ్చులో ఇరుక్కున్నారు. ఫలితంగా రెండు రాజ్యాంగబధ్ధ వ్యవస్థల మధ్య అవాంఛ‌నీయమైన పరిణామాలు చోటు చేసుకుని పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఉన్నత పదవుల పరువు విలువ దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలు కారకులే. అయితే ఇలా జరగడానికి ఎవరిది తప్పు అన్న దాని మీద రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది మొదటి తప్పు అంటున్న వారే ఎక్కువగా ఉన్నారు.

అలా చేసి ఉంటే..?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీ. ఆయన సర్వ స్వతంత్రుడు. పూర్తి రాజ్యాంగబద్ధమైన అధికారాలు కలిగిన వారు. అటువంటి నిమ్మగడ్డ వారు తాను చేసింది రాజ్యంబద్ధంగా కరెక్ట్ అనుకుంటున్నారు కానీ నైతికంగా తప్పు అని ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. భారీ మెజారిటీతో ఎన్నికలైన ప్రభుత్వం ఒక వైపు ఉంది. ఎన్నికలు నిర్వహణ, వాయిదా, రద్దు ఇలాంటి వాటి విషయంలో తనకు విశేష అధికారాలు ఉన్నా ప్రజాస్వామ్యబధ్ధంగా అమలుచేసేందుకు నిమ్మగడ్డ ఏ కోసానా ప్రయత్నం చేయలేదన్నది ఇపుడు మేధావుల చెబుతున్న మాట.

జగన్ సరేనట……

నిజానికి స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శాఖ అధికారులతో కరోనా వైరస్ గురించే సమీక్ష చేస్తున్నారు. ఏ కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా అని నిమ్మ‌గడ్డ వారు ప్రకటించారో అదే కరోనా వైరస్ గురించి పూర్తి సమాచారంతో ముఖ్యమంత్రి సిధ్ధంగా ఉన్నారు. ఆ టైంలో నిమ్మ‌గడ్డ కనుక ప్రభుత్వంతో వాయిదా అంశం చర్చించి ఉంటే హుందాగా జగన్ సహా ప్రభుత్వం మొత్తం అంగీకరించేదిట. ఇదే విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తాజాగా చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వాన్ని కించపరచేలా నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం ఏకపక్షంగా తీసుకోవడం వల్లనే వివాదం అతి పెద్దదిగా మారిందని బుగ్గన అంటున్నారు.

నాడు అలానా ….

ఇక ఈ నెల 7న‌ నిమ్మగడ్డ అన్ని రాజకీయ పార్టీలతో స్థానిక‌ ఎన్నికల విషయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావన వచ్చింది. వైసీపీతో సహా దాదాపుగా అన్ని పార్టీలు కరోనా గురించి ఆలోచించుకోవాలని కోరాయని సమాచారం. అయితే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికలకు సిధ్ధమని, గో ఎహెడ్ అనేశారు. నాడే నిమ్మగడ్డ కరోనా వైరస్ గురించి అలెర్ట్ అయి అన్ని పార్టీలతో నిర్ణయం తీసుకుంటే ఇంత గొడవ వచ్చేది కాదు అంటున్నారు. ఇక వాయిదా విషయంలో అయినా అన్ని పార్టీలను పిలిచి చర్చలు జరిపితే పోయేదని కూడా అంటున్నారు. మరో వైపు నిమ్మగడ్డ వాయిదాపై జగన్ తో సహా వైసీపీ నేతల స్పందన దారుణంగా ఉందన్న కామెంట్స్ ఉన్నాయి. దానికి ప్రతిగా అన్నట్లుగా నిమ్మగడ్డ విడుదల చేసినట్లుగా చెప్పబడుతున్న లేఖతో సర్కార్ పరువు పూర్తిగా పోయింది. మొత్తానికి నిమ్మగడ్డ ఏకపక్ష విధానాలు, వైసీపీ దూకుడు రాజకీయం, విపక్షాల అతి అన్నీ కలసి మొత్తానికి ఏపీలో అతి పెద్ద రచ్చను, మచ్చను మిగిల్చాయి.

Tags:    

Similar News