జ‌గ‌న్ డీలా పడుతున్నారా? వాదనల్లో పసలేదా?

ఏపీ ప్రభుత్వం గురించి ఇటు రాష్ట్రంలోను, అటు పొరుగు రాష్ట్రాల్లోనూ కూడా తీవ్రస్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. సీఎం జ‌గ‌న్ తీసు కుంటున్న నిర్ణయాల‌పై ప్రతిప‌క్షాలో.. ఆయా పార్టీల‌కు [more]

Update: 2020-03-24 05:00 GMT

ఏపీ ప్రభుత్వం గురించి ఇటు రాష్ట్రంలోను, అటు పొరుగు రాష్ట్రాల్లోనూ కూడా తీవ్రస్థాయిలో చ‌ర్చ న‌డుస్తోంది. సీఎం జ‌గ‌న్ తీసు కుంటున్న నిర్ణయాల‌పై ప్రతిప‌క్షాలో.. ఆయా పార్టీల‌కు మ‌ద్దతుదారులుగా ఉన్నవారో.. లేదా ప్రజ‌లో కోర్టుల్లో కేసులు వేస్తున్నా రు. ఇప్పటి వ‌ర‌కు ఈ ప‌ది మాసాల్లో దాదాపు సీఎంగా జ‌గ‌న్ తీసుకున్న ప్రతి నిర్ణయంపైనా కోర్టుల్లో కేసులు దాఖ‌ల‌య్యాయి. ఒక్క దిశ చ‌ట్టం, మండ‌లి ర‌ద్దు (ప్రస్తుతం కేంద్రం ప‌రిధిలో ఉంది) త‌ప్ప మిగిలిన అన్ని విష‌యాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాల పైనా హైకోర్టులో కేసులు దాఖ‌ల‌య్యాయి. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం, పేద‌ల‌కు ఇళ్లస్థలాలు వంటి క‌ర్టన్ రైజ‌ర్ (ప్రతిష్టాత్మక‌) కార్యక్రమాల‌పైనా కోర్టుల్లో కేసులు ఇంకా న‌డుస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ కార్యాల‌యాల‌ను క‌ర్నూలు, విశాఖ‌ల‌కు త‌ర‌లించ‌డంపైనా కోర్టు వ‌ద్దని తీర్పు చెప్పింది.

ప్రతి నిర్ణయంపైనా…?

ఇప్పటికే ముగిసిన కేసుల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఎక్కువ‌గా (మెజారిటీ) తీర్పులు వ‌చ్చాయి. దీనిపై ఇటు ప్రభుత్వంలోను, అటు వైసీపీ సానుభూతి ప‌రుల్లోనూ తీవ్రమైన ఆవేద‌న క‌లుగుతోంది. జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేప‌డుతున్న కార్యక్రమాల‌కు నిజానికి ప్రజ‌ల్లో చాలా ఎఫెక్ట్ ఉంది. వాటిని వారు స్వాగ‌తిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంపై ప్రజ‌లు స్వాగతించారు. అంతేకాదు, దీనిపై హైకోర్టులో కొంద‌రు కేసు వేసిన‌ప్పుడు మేం కూడా మావాద‌న వినిపిస్తాం అంటూ.. ప్రజ‌లు ముందుకు వ‌చ్చారు. దీనిపై తీర్పు ఇంకా వెలువ‌డ‌లేదు. కానీ, హైకోర్టు మాత్రం పుస్తకాలు ప్రింట్ చేయొద్దని, ఉపాధ్యాయుల‌కు శిక్షణ త‌ర‌గ‌తులు నిర్వహించ‌రాద‌ని మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు ఇచ్చింది.

వాదనలు విన్పించలేకపోతున్నారా?

ఇక‌, స్థానిక ఎన్నిక‌ల‌పై సుప్రీం కోర్టులో నిజానికి చెప్పాలంటే.. ప్రభుత్వ వాద‌న వీగిపోయింది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ సొంత బాబాయి, మాజీ మంత్రి వివేకా కేసులోనూ ప్రభుత్వ వాద‌న‌ను హైకోర్టు కొట్టేసింది. కేసును సీబీఐకి అప్పగించింది. మ‌రి జ‌గ‌న్ వ్యూహం బాగున్నా.. దీనికి సంబంధించి కోర్టుల ప‌రిధిలోకి వ‌చ్చే స‌రికి ఎందుకు ఎదురు వ‌స్తోంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా మారింది. ప్రభుత్వ వ్యూహాన్ని వాద‌నల రూపంలో కోర్టుల‌కు విన్నవించ‌డంలో లాయ‌ర్లు త‌డ‌బ‌డుతున్నారా ? ఇప్పుడున్న ప్రభుత్వ న్యాయ‌వాది జ‌గ‌న్ వ్యూహానికి త‌గిన విధంగా ముందుకు పోలేక పోతున్నారా ? అనే సందేహాలే వ‌స్తున్నాయి. లేక పోయివుంటే, ఇలా ఎందుకు ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన కేసులు ప్రభుత్వం దాదాపు చేతులు ఎత్తేసింది. దీనికి కార‌ణం ఏంటి? ఇక‌పైనా కోర్టుల‌కు అనేక కేసులు వెళ్లే ఛాన్స్ ఉన్న నేప‌థ్యంలో ప్రభుత్వం త‌ర‌ఫున బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించే వారిని నియ‌మించుకోవాల‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News