ఆ రెండు జిల్లాలు అవుట్… రాసిపెట్టుకోవచ్చా ?

ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే అన్నింటా విజయభేరీ వైసీపీ మోగించింది. ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ని చేసి చూపించింది. ఒకనాడు ఎన్టీఆర్ ఇంతటి విజయాలు సొంతం [more]

Update: 2020-03-23 02:00 GMT

ఏపీలో పదమూడు జిల్లాలు ఉంటే అన్నింటా విజయభేరీ వైసీపీ మోగించింది. ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ని చేసి చూపించింది. ఒకనాడు ఎన్టీఆర్ ఇంతటి విజయాలు సొంతం చేసుకున్నా ఆయన సైతం 87 శాతం సీట్ల షేర్ సాధించలేదు. జగన్ పదేళ్ళ కష్టానికి అలా దక్కిన ఫలితం ఇది. అంతే కాదు. ఆ కులం, ఈ కులం అని చూడకుండా అన్ని కులాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. అందుకే టీడీపీకి చరిత్రలో ఎరగని ఓటమి దక్కింది. కేవలం 23 సీట్లకే పరిమితమైపోయారు.

కృష్ణార్పణమేనా?

టీడీపీకి పట్టుకొమ్మలుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా జై జగన్ అన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల‌లో ఉన్న 34 సీట్లలో మూడొంతులు వైసీపీ పరం అయ్యాయి. అయితే జగన్ ఆ తరువాత వరసగా తీసుకున్న నిర్ణయాల మూలంగా ఈ రెండు జిల్లాలు తొందరగానే వ్యతిరేక బాట పట్టాయని అంటున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని తరలింపు వ్యవహారం మొత్తం ఈ రెండు జిల్లాలకే పరిమితమైంది. అలాగే కమ్మ సామాజికవర్గం తమను నేరుగా వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తోందని గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

కులం కార్డు…..

జగన్ ఆవేశంతో అంటున్న కొన్ని మాటలు, ఆయన పోకడలు కమ్మ సామాజికవర్గానికి పూర్తిగా దూరం చేశాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో జగన్ మండిపడుతూ ఆయనదీ చంద్రబాబుది ఒకే కులం అంటూ ఆరోపించడం ద్వారా తప్పు ఎత్తి చూపాలనుకున్నారు. కానీ అక్కడే పప్పులో కాలేశారు. రమేష్ మీద వ్యతిరేకత కాస్తా జగన్ మీదకు అలా పాకిపోయింది. పైగా వైసీపీలోని కమ్మ వారు సైతం ఈ పరిణామంతో జగన్ మీద గుస్సా అయ్యేలా ఉందని అంటున్నారు. జగన్ కి కమ్మ కులం అంటే ఇష్టం లేదన్న భావనను ఆయన ఈ మాటలతో ఒక్కసారిగా బయటపెట్టుకున్నారు.

ఆ మంత్రి సైలెంట్…?

ఇక జగన్ క్యాబినేట్లో ఒకే ఒక మంత్రి ఉన్నారు. ఆయనే కొడాలి నాని. ఆయన చంద్రబాబుని తిట్టినంతగా జగన్ కూడా తిట్టలేదు. అయితే ఆయన అనడం వేరు. నేరుగా జగన్ కమ్మ కులం పైన బాణాలు వేయడం వేరు. ఇపుడు అదే మంట పెడుతోంది. జగన్ మాట ఆ కులంలో ఎక్కడ లేని ఐక్యతను తెచ్చిపెట్టింది. ఒకనాడు పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తో సహా, మరో పాప్ సింగర్, ఇంకో ప్రముఖ రంగానికి చెందిన పెద్దాయన ఇలా అందరూ కలసి జగన్ మీదకు ఒక్కసారిగా కత్తులు దూశారు. ఇది చాలు ఆ కులం ఎంతటి సంఘటితమైందో వాళ్ళలో చాలా మంది చంద్రబాబుని వ్యతిరేకించిన వారున్నారు. అయితే అంతా కలసి ఇపుడు వైసీపీని దూరం పెడుతున్నారంటే ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవని అంటున్న్నారు. ఈ సంగతి తెలిసే కొడాలి నాని కూడా మౌనం దాల్చారని తెలుస్తోంది.

Tags:    

Similar News