జగన్…ఎందుకిలా బెడిసి కొడుతున్నాయ్?

మా రాజన్నఅ బిడ్డ. పెద్దాయన కొడుకు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఆయనకూ బాగుంటుంది. మాకూ మంచి జరుగుతుందని సొంత సామాజిక వర్గం నేతలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద [more]

Update: 2020-03-18 05:00 GMT

మా రాజన్నఅ బిడ్డ. పెద్దాయన కొడుకు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఆయనకూ బాగుంటుంది. మాకూ మంచి జరుగుతుందని సొంత సామాజిక వర్గం నేతలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున జగన్ కి సపోర్ట్ చేశారు. పదేళ్ళ పాటు ఆయనకు అండగా నిలబడ్డారు. ఆయన కష్టంలో, నష్టంలో భాగం అయ్యారు. అందరి ఆశలు ఫలించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ అయిదు కోట్ల మంది నాయకుడిగా, యువ నేతగా బోలేడు భవిష్యత్తు ఉన్న లీడర్ గా నాడు అంతా భావించారు. జగన్ కి వచ్చిన బంపర్ మెజారిటీని చూసి ఆయన సొంతంగా చెప్పుకున్నట్లుగా ముప్పయ్యేళ్ళ పాటు పాలన కాదు కానీ 2024లోనూ డెడ్ ఈజీగా ఆయనే గెలుస్తాడని వైరి పక్షం సైతం గట్టిగా నమ్మింది.

మొండితనమా…?

జగన్ ఎవరి మాటా వినరని పార్టీలో అంతా అనుకోవడమే ఇంతవరకూ ప్రచారం. అయితే జగన్ సీఎం అయ్యాక ఆయన వైఖరి ప్రత్యక్షంగా చూస్తున్న వారికి మాత్రం అందులో వాస్తవం ఉందని అర్ధమవుతోంది. జగన్ ది ఒంటెద్దు పోకడ. ఆయన ఎవరి సలహాలు తీసుకోరు. తనకు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటి ఫలితాలూ, పర్యవశానాలు అసలు ఆలోచించరని కూడా బోధపడుతోంది. ఇక అధికారులు సైతం మొదట్లో సంతోషించినా తరువాత జగన్ పోకడలతో ఇబ్బంది పడుతున్నట్లుగానే కనిపిస్తున్నారు. జగన్ సీఎంగా ఎన్నికైన కొత్తల్లోనే తనకు అనుకూలంగా ఒక పధకం గురించి చెప్పలేదని ఓ ఉన్నతాధికారి మీద మండిపడ్డారని అప్పట్లో వార్త ప్రచారంలోకి వచ్చింది. అదెంత నిజమో తెలియదు కానీ నాటి నుంచి సీఎం ఏమంటే అదే చేస్తూ అధికారులు పూర్తిగా సరెండర్ అయిపోయారని అంటున్నారు. దాంతో ముఖ్యమంత్రి నిర్ణయాలు చాలా వరకూ న్యాయస్థానాల్లోనూ, బయటా బెడిసికొడుతున్నాయని చెబుతున్నారు.

బదనాం అయ్యారా…?

ఇక జగన్ కి ప్రత్యర్ధిగా చంద్రబాబు ఉన్నారు. ఆయన తలపండిన నాయకుడు. సూది మొన అంత విషయం ఉంటే దాన్ని కొండంతగా చేసి చూపే సామర్ధ్యం ఉంది. పైగా మీడియా మద్దతు బాగా ఉన్న నేత. దాంతో జగన్ కి తుగ్లక్ అని పేరు మొదట్లనే పెట్టేసి ఇపుడు ఆయన నిర్ణయాలను అలా జనంలోకి బూతద్దమో పెట్టేశారు. అది అమరావతి రాజధాని అయినా, పోలవరం రివర్స్ టెండరింగ్ అయినా ఇసుక పాలసీ అయినా జగన్ మొండితనంగా ముందుకువెళ్తూంటే దాన్ని బాగా నెగిటివ్ చేస్తూ జనంలోకి ఫోకస్ చేస్తున్నారు. దాంతో జగన్ బదనాం అవుతున్నారని సొంత పార్టీలోనే ఆవేదన వ్యక్తం అవుతోంది.

అలా కూడదుగా…?

ఇక ఈసీ ఎన్నికలను వాయిదా వేశారు. అది నిజంగా జగన్ కి అవమానమే. కానీ దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకోకపోగా ఏకంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారి మీద జగన్ నోరు చేసుకున్నారు. మధ్యలో కులం కూడా తెచ్చేశారు. జగనే అలా ఉంటే ఆయన మంత్రులు, అనుచరులు అదే తీరున వెళ్ళారు. వెరసి ఈ వివాదంతో జగన్ కి ఇంకా చెడ్డ పేరు వచ్చేసింది. మరో వైపు ఈ వాయిదాలో రాజకీయం ఉందనుకున్నా అంతకంటే ముందు కరోనా వైరస్ ఉంది. అది సాకు కావచ్చు కానీ ఏపీ జనంలో ఉన్న అతి పెద్ద భూతం. భయం కరోనా వైరస్. దాన్ని కూడా కాదనే విధంగా వైసీపీ సర్కార్ పెద్దలు దూకుడుగా ఈసీ మీద విరుచుకుపడుతూంటే జనంలో దారుణమైన వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. మా ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యమా అన్న మాట కూడా వినిపిస్తోందిపుడు.

పనికిరారా…?

సరిగ్గా ఈ సమయాన్ని సావకాశంగా మార్చుకుని మాజీ మంత్రి యనమల మీడియాలో రంగప్రవేశం చేశారు. జగన్ ని ఆయన రాజకీయాలే అసలు పనికిరారు అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీ నేతలను రౌడీలతోనూ పోల్చారు. మరో వైపు జగన్ ఈసీని అన్న మాటల మీద కూడా ఫిర్యాదుకు టీడీపీ రెడీ అవుతోంది. ఇంకో వైపు తనను ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కులం పేరిట దూషించడంపైన ఈసీ రమేష్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని టాక్. ఇక ఈసీని తమకు తాము దూరం చేసుకుని టీడీపీకి దగ్గర చేసిన వైసీపీ పెద్దలు రేపటి ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తారో కూడా చూడాలంటున్నారు.

Tags:    

Similar News