జగన్ తన మైండ్ సెట్ ను మార్చుకున్నారట

జగన్ ఎపుడైతే ముఖ్యమంత్రి అయ్యారో నాటి నుంచి ఆయన మీడియా ముఖం చూడడం మానేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి అచ్చంగా పదినెలల కాలం గడచిపోయింది. అప్పట్లో [more]

Update: 2020-03-17 06:30 GMT

జగన్ ఎపుడైతే ముఖ్యమంత్రి అయ్యారో నాటి నుంచి ఆయన మీడియా ముఖం చూడడం మానేశారు. ఆయన మీడియా ముందుకు వచ్చి అచ్చంగా పదినెలల కాలం గడచిపోయింది. అప్పట్లో బాబు సీఎంగా ఉంటే ప్రతీ రోజూ మీడియా మీటింగులే. మీడియాకు ఆ విధంగా పండుగే. కానీ జగన్ తీరు అందుకు భిన్నం. అన్ని విషయాలూ మంత్రుల చేత మాట్లాడిస్తూ తాను మాత్రం మౌన మునిలా ఉండేవారు. అటువంటి జగన్ తపస్సుని భంగం చేసింది అక్షరాలా ఈసీయేనని చెప్పకతప్పదు. జగన్ సీఎంగా తొలి మీడియా మీటింగ్ అంతా అగ్రెస్సివ్ గా సాగిపోయింది. అయినా సరే తాను చెప్పదలచుకునంది చెప్పేసి విపక్షానికి, ఈసీకి గట్టి ఝలక్ ఇచ్చారు.

ఫోకస్ పెరిగింది….

సహజంగా అధికార పక్షం మీడియా మీటింగ్ అంటే దాని విలువ వేరు. ఫోకస్ కూడా ఉంటుంది. కానీ జగన్ ఆ సదవకాశాన్ని పది నెలల కాలంలో ఎపుడూ ఉపయోగించుకోలేదు. కానీ తొలిసారిగా ఆయన నలభై నిముషాలకు పైగా మాట్లాడి విపక్షం జాతకాన్ని బట్టబయలు చేశారు. దాంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. ఎన్నికల వాయిదా పక్కన పెడితే జగన్ ఇలా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుని కడిగేయడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.

ఏకపక్షంగానే….

నిజానికి జగన్ మీడియాకు దూరంగా ఉండడం, అదే సమయంలో చంద్రబాబు విపక్షంలో ఉన్నా కూడా ప్రతీ రోజూ మీడియా ముందు వేసుకుని నానా యాగీ చేయడం ద్వారా జనాన్ని తన వైపునకు తిప్పుకుంటున్నారు. వైసీపీలో బాబుకు ధీటుగా మంత్రులు రెస్పాండ్ కాలేకపోతున్నారు. అయినా కూడా జగన్ తీరును కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడి గట్టి రిటార్ట్ ఇచ్చేవారు కూడా లేరు. దాంతో మీడియాలో బాబు, పవన్ లాంటి వారు హైలెట్ అవుతున్నారు. ఓ విధంగా వైసీపీకి యాంటీగా మెజారిటీ మీడియా ఉండడంతో అంతా ఏకపక్షమైపోయింది. ఈ వాస్తవాన్ని వైసీపీ పెద్దలు గ్రహించినా జగన్ ముందు ఇప్పటిదాకా చెప్పలేకపోయారు. ఇపుడు జగనే మీడియా ముందుకు రావడంతో వారు కూడా ఆనందిస్తున్నారు. మాటకు మాట అసెంబ్లీలో జవాబు చెబితే సరిపోదని, మీడియాను కూడా ఉపయోగించుకోవాలని, తద్వారా విపక్ష విష ప్రచారానికి తెర వేయాలని కోరుతున్నారు.

ఇకపైన అలాగేనా…?

జగన్ కూడా ఎటూ మీడియా ముందుకు వచ్చేశారు కాబట్టి ఇకపైన ఇదే తీరున అవసరం పడినపుడల్లా మీడియా భేటీలు వేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. దాని వల్ల తమ వాదన కూడా జనంలోకి వెళ్తుందని, బాబు అండ్ కో చేస్తున్న అబద్దపు ప్రచారానికి కొంత అయినా బ్రేకులు పడతాయని జగన్ భావిస్తున్నారుట. దాంతో రానున్న రోజుల్లో జగన్ మీడియా సమావేశాలు తరచుగా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ సైతం తన పధకాలు, ఆలోచనలకు సరైన మీడియా మద్దతు లేదని భావిస్తున్నారుట. దాంతో ఇకపైన బాగా ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారుట. మొత్తానికి ఈసీ ఎన్నికల వాయిదా నిర్ణయం కాదు కాని అది తిరిగి వైసీపీకే మేలు చేసేలా ఉందని పార్టీ నాయకులు అంటున్నారు.

Tags:    

Similar News