ఆందోళన..భయం…వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమైంది?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలయింది. జగన్ చెప్పినట్లే వింటామని ఇన్నాళ్లూ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసంతృప్తికి లోనవుతున్నారు. కొందరు తమ సన్నిహితుల వద్ద [more]

Update: 2020-03-25 08:00 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలయింది. జగన్ చెప్పినట్లే వింటామని ఇన్నాళ్లూ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అసంతృప్తికి లోనవుతున్నారు. కొందరు తమ సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతోనే వైసీపీ ఎమ్మెల్యేల్లో భయం కన్పిస్తుంది. ఒకరకరమైన అభద్రతకు వారు లోనవుతున్నారు. బయటకు చెప్పనప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది జగన్ నిర్ణయాలను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారు.

పది నెలల క్రితం…..

పది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పెద్దయెత్తున పట్టం కట్టారు. 151 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీకి ఇచ్చారు. అందుకే జగన్ కు ఎవరినీ తాను పార్టీలోకి చేర్చుకునే అవసరం కలగలేదు. ఎమ్మెల్యేలను కూడా తాను పార్టీలోకి చేర్చుకోనని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగన్ ఆలోచన మారింది. ప్రభుత్వం ఏర్పడిన పది నెలలకే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది వాస్తవం.

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో….

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ పార్టీలో చేరికలకు డోర్లు బార్లా తెరిచేశారు. దీంతో ఇప్పటి వరకూ అన్ని జిల్లాల నుంచి టీడీపీ, జనసేన నేతలు వరసపెట్టి తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఒకరకంగా టీడీపీని బలహీనపర్చాలని జగన్ చేసే ప్రయత్నమయినా వైసీపీలో మాత్రం సీనియర్ నేతలతో ఇప్పటికే నిండిపోయింది. వారు చేరిన వెంటనే ఎఫెక్ట్ పెద్దగా కన్పించకపోయినా భవిష్యత్తులో వారి ప్రభావం ఉంటుందన్నది వాస్తవం.

ఎమ్మెల్యేల్లో అసహనం….

ఇప్పటికే జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి చేరికతో అక్కడి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. రామచంద్రాపురంలోనూ అంతే. తాజాగా కరణం బలరాం మద్దతివ్వడంతో ఆమంచి కృష్ణమోహన్ పరిస్థతి అలాగే ఉంది. గత ఎన్నికల్లో తమ ప్రత్యర్థులందరూ తమ పక్కనే చేరుతుండటంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలయింది. లాబీయింగ్ చేసుకుని వారు తమపై పెత్తనం చేస్తారేమోనన్న భయం పట్టుకుంది. మరి జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టో? కాదో? తేలాలంటే భవిష్యత్తులో తెలియాల్సిందే.

Tags:    

Similar News