జగన్ కి ఏమీ తెలియదంటున్నారు? ఇప్పుడేమంటారు?

జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు అని చంద్రబాబు, తమ్ముళ్ళు ప్రతీ సారీ వేళాకోళం చేస్తారు. ఆయన గురించి ప్రజలకు ఏమీ తెలియదు అంటారు. అయితే జగన్ హైదరాబాద్ [more]

Update: 2020-03-09 13:30 GMT

జగన్ ఎక్కడ చదువుకున్నారో తెలియదు అని చంద్రబాబు, తమ్ముళ్ళు ప్రతీ సారీ వేళాకోళం చేస్తారు. ఆయన గురించి ప్రజలకు ఏమీ తెలియదు అంటారు. అయితే జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తారు. ఈ వివాదాలు ఎలా ఉన్నా జగన్ ఇంగ్లీష్ ప్రావీణ్యం పట్ల మాత్రం బాబు అండ్ కో కూడా ఏమీ అనలేని పరిస్థితి. జగన్ మంచి ఇంగ్లీష్ లో మాట్లాడుతారు అన్నది దాదాపుగా అందరూ అంగీకరించేదే. ఇక జగన్ ఇంగ్లీష్ మరో విధంగానూ రచ్చ అవుతూ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను జగన్ వేశపెట్టాలనుకుంటున్నారు. దానికి కులం, మతం రంగులు పూసి మరీ గత కొన్నాళ్ళుగా ఏపీలో విపక్షం అల్లరి చేస్తూనే ఉంది.

కేసీఆర్ అలా…..

ఎవరేమనుకున్నా పేదలకు ఇంగ్లీష్ బోధన అవసరమని జగన్ గట్టిగా భావిస్తున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల బోధన మొదలవుతోంది. దీని మీద రిపోర్టులను తెలంగాణా సీఎం కేసీఆర్ తెప్పించుకున్నారట. నిండు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఏపీలో సర్కార్ బడుల్లో ఆంగ్ల బోధన కాన్సెప్ట్ బాగుంది. తెలంగాణాలోనూ అమలు చేసేందుకు చూస్తామంటూ చెప్పడం బట్టి జగన్ పాలనా సంస్కరణ ఏంటన్నది తెలుస్తోంది. ఆయన వేసిన అడుగును పొరుగు రాష్ట్ర సీఎం అనుసరించడం అంటే నిజంగా గ్రేటే అనుకోవాలి.

సచివాలయాలూ….

అంతే కాదు, ఏపీలో సక్సెస్ బాటలో ఉన్న సచివాలయాల కాన్సెప్ట్ ని కూడా తెలంగాణా సర్కార్ పరిశీలిస్తోందిట. పల్లెలకే అన్ని అధికారాలూ అంటూ ముందుకు వస్తున్న కేసీఆర్ సర్కార్ ఏపీలో అమలవుతున్న సచివాలయ వ్యవస్థను స్టడీ చేయమంటోందట. ముఖ్యంగా గ్రామ పరిపాలనకు పెద్ద పీట వేయాలనుకుంటున్నారుట. ఇక్కడ సచివాలయాలు అన్నారు. సరిగ్గా ఆ పేరే కాకపోయినా వేరే విధంగా కేసీఆర్ ఈ వ్యవస్థను అమలు చేసేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.

నోళ్ళు మూతేనా…?

జగన్ కి ఏమీ తెలియదు, ఆయనకు పాలించడం చేతకాదు, ఆయన తుగ్లక్ అంటూ విమర్శలు చేస్తున్న ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఆయన గారి మాజీ మంత్రులు ఇపుడేమంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న విధానాలను దేశమంతా ఇపుడు అమలు చేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు అంటున్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ కానీ, ఆంగ్ల విద్యా బోధన, గ్రామ సచివాలయాలు కానీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ మేలైన పాలన చేస్తున్నారని తమ్ముళ్ళు బయటకు అనకపోయినా కిక్కురుమనలేని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News