అందుతుందా? అందకుండా పోతుందా? బిగ్ క్వశ్ఛన్

విశాఖ మేయర్ పీఠం ఇపుడు వైసీపీ టార్గెట్ గా ఉంది. ఎందుకంటే విశాఖ జగన్ ఊరిస్తోంది. ఇప్పటికీ కూడా చిక్కలేదు, దక్కలేదు. వైసీపీకి ఎన్నో అమోఘమైన విజయాలు [more]

Update: 2020-03-11 11:00 GMT

విశాఖ మేయర్ పీఠం ఇపుడు వైసీపీ టార్గెట్ గా ఉంది. ఎందుకంటే విశాఖ జగన్ ఊరిస్తోంది. ఇప్పటికీ కూడా చిక్కలేదు, దక్కలేదు. వైసీపీకి ఎన్నో అమోఘమైన విజయాలు వచ్చి చేరినా కూడా విశాఖ దరి చేరకపోవడం మాత్రం జగన్ తదితర పెద్దలకు అతి పెద్ద లోటుగా ఉందిట. ఓ విధంగా సంపూర్ణ విజయం ఆనందాన్ని వారు పొందలేకపోతున్నారుట. అవును మరి 2014 నుంచి విశాఖ అలా దెబ్బ తీస్తూనే ఉంది. నాడు విజయమ్మ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచింది. అయినా విశాఖ నగర పరిధిలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లూ సైకిలెక్కేశాయి.

కీలక‌మట….

విశాఖ మేయర్ పదవి ఇపుడు మనకు చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకుని తీరాలని ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆరు నూరైనా విశాఖ జీవీఎంసీ పైన వైసీపీ జెండా ఎగరాల్సిందేనని ఆయన‌ అంటున్నారు. క్యాడర్ ఇందుకోసం గట్టిగా శ్రమించాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. విశాఖను రాజధానిగా చేస్తున్న నేపధ్యంలో నగర పాలన కూడా తమ పార్టీ చేతుల్లో ఉండాలని ఆయన అంటున్నారు. రెండు చోట్లా ఒకే పార్టీ పాలన ఉంటే అభివృద్ధి జోరుగా సాగుతుందని అంటున్నారు.

చాన్స్ దక్కేనా…?

విశాఖలో కాస్మోపాలిటిన్ కల్చర్ ఉంటుంది. ఎక్కువగా మేధావులు, చదువరులు ఉంటారు. జగన్ పార్టీకి మొదటి నుంచి ఇక్కడ ఆదరణ తక్కువ. అదే సమయంలో టీడీపీకి పట్టు బాగా ఉంది. పైగా బాబు మంచి పాలనాదక్షుడన్న అభిప్రాయం నగరవాసుల్లో ఉంది. ఇక వైసీపీ సర్కార్ రాజధానిగా విశాఖను ప్రకటించడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో విశాఖవాసులు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారని అంటారు.

టఫ్ ఫైట్ గా…..

విశాఖ అర్బన్ జిల్లా వరకూ బలమైన నాయకత్వం వైసీపీకి లోకల్ గా లేకపోవడం పెద్ద లోటుగా చెప్పాలి. బయట నుంచి వచ్చిన విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీ రధాన్ని పరుగులు పెట్టిస్తున్నా స్థానిక నాయకులు బలంగా ఉంటేనే ఆ ఫలితాలు దక్కుతాయి. అయితే ఇపుడు పార్టీ అధికారంలో ఉండడంతో కొంత వరకూ పరిస్థితి అనుకూలం చేసుకోవడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో చూడాలి. ఇక టీడీపీకి చూస్తే మంచి బలం ఉన్నా కూడా నైరాశ్యం నిండా ఆవరించింది. దానికి తోడు ఆధిపత్య పోరుతో పార్టీ సతమవుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు దిక్కులుగా ఉన్నారు. చావో రేవో అన్నట్లుగా బరిలోకి దిగిగే టీడీపీకి కూడా ఆశాజనకమైన వాతావరణం ఉండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా మేయర్ పోరు రెండు పార్టీలకు ప్రతిష్టగానే ఉంటుంది.

Tags:    

Similar News