వారి కోసం జగన్ మాస్టర్ ప్లాన్ ?

లోకల్ బాడీ ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో జరిగితీరాలి. లేకపోతే కేంద్రం నుంచి అయిదువేల కోట్ల మేర నిధులు విడుదల కావు. ఏపీ లాంటి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఆ [more]

Update: 2020-03-11 00:30 GMT

లోకల్ బాడీ ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో జరిగితీరాలి. లేకపోతే కేంద్రం నుంచి అయిదువేల కోట్ల మేర నిధులు విడుదల కావు. ఏపీ లాంటి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఆ నిధులు ఎంత‌టి అవసరమో అందరికీ తెలిసిందే. దాంతో హడావుడిగా మార్చిలో ఒక్కసారిగా అన్ని ఎన్నికలూ జగన్ జరిపించేస్తున్నాడు. నిజానికి ఈ ఎన్నికలు జనవరిలోనే జరగాలి. బీసీలకు 59 శాతం రిజర్వేషన్ల మీద కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వ్రుధాగా రెండు నెలల సమయం పోయింది. ఇవీ నిజాలు. అయితే బీసీల కోటా మీద సుప్రీం కోర్టుకు టీడీపీ వెళ్ళింది. బీసీ ద్రోహిగా జగన్ని చూపించాలని చూసింది.

గట్టి దెబ్బ…..

దానికి విరుగుడు అన్నట్లుగా జగన్ గట్టి దెబ్బ తీశారు. ఇపుడు హైకోర్టు తీర్పు కారణంగా 24 శాతానికి తగ్గిన బీసీ కోటాను యధాతధంగా అంటే 34 శాతంగా ఉండేలా చూసేందుకు జనరల్ సీట్ల నుంచి మరో పది శాతం పెంచుతూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేతగా జగన్ తీసుకున్న డెసిషన్ ఇదన్నమాట. దీనివల్ల వైసీపీ వరకూ బీసీలకు మొత్తం రిజర్వేషన్లు దక్కినట్లే. పైగా అధికార పార్టీ కాబట్టి, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జగన్ ఎత్తుగడలు ఫలించినట్లే అనుకోవాలి.

అలా చేయగలరా…?

ఇది నిజంగా టీడీపీకి ఇరకాటంగా చూడాలి. ఆ పార్టీ ఇపుడు విపక్షంలో ఉంది. డబ్బులు తీసి గెలిచే నాయకులు కావాలి. బీసీల్లో సమర్ధులు ఉన్నా కూడా డబ్బుల విషయంలో అధికార పార్టీతో పోటీ పడాలంటే బలమైన ఇతర కులాల నేతలనే దించడం టీడీపీకి అలవాటు. ఇపుడు బీసీ మంత్రం దానికి అడ్డువస్తోంది. అలా కాదు అనుకుంటే బీసీలను ముందు పెట్టి వారికి పార్టీ పెట్టుబడి పెట్టి గెలిపించుకోవాలి. అది చేయడం అంటే ఇపుడు టీడీపీకి చాలా కష్టం. పైగా విపక్షంలో అన్నీ హరించుకుపోయాక ఎవరు ముందుకు వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఈ రకమైన చక్రబంధంలో బాబుని బంధించి జగన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు.

గంపగుత్తగా….

సార్వత్రిక ఎన్నికల నాటికే టీడీపీ నుంచి బీసీ ఓటు బ్యాంక్ కి పెద్ద ఎత్తున లాగేసిన జగన్ తాజా నిర్ణయంతో మరింతగా లాగేస్తాని అంటున్నారు. అదే జరిగితే బీసీల పార్టీగా ముద్ర పడిన టీడీపీకి అది చెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వైసీపీ తరఫున బీసీ ప్రతినిధులు నెగ్గితే సుదీర్ఘకాలం పాటు ఆ పార్టీ మనుగడకు, క్షేత్ర స్థాయిలో బలమైన సాధనంగా వారు ఉంటారని అంటున్నారు. భవిష్యత్తు రాజకీయాలను కూడా ద్రుష్టిలో ఉంచుకునే జగన్ బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని అంటున్నారు. కోర్టు కరుణించకపోయినా తాను న్యాయం చేసి చూపిస్తాన్ని జగన్ ముందుకురావడం ద్వారా బీసీల్లో బాగా మార్కులు సాధించారని కూడా అంటున్నారు.

Tags:    

Similar News