జ‌గ‌న్ ప్రెజర్ వెనక అస‌లు వ్యూహం ఇదేనటగా

అధికార పార్టీ వైసీపీలో ఒక్కసారిగా టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త్వర‌లోనే జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లు జరగనున్న నేప‌థ్యంలో నాయ‌కుల‌ను ఆయ‌న అలెర్ట్ చేశారు. అలెర్ట్ అంటే [more]

Update: 2020-03-10 02:00 GMT

అధికార పార్టీ వైసీపీలో ఒక్కసారిగా టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. త్వర‌లోనే జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లు జరగనున్న నేప‌థ్యంలో నాయ‌కుల‌ను ఆయ‌న అలెర్ట్ చేశారు. అలెర్ట్ అంటే ఏదో సాదాసీదాగా వారిని హెచ్చరించి వ‌దిలేయ‌డం కాదు. తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓడితే.. ఇంటికే.. అంటూ.. మంత్రుల‌కు హెచ్చరించారు. అదే స‌మ‌యంలో మ‌ళ్లీ టికెట్ కావాలంటే.. ఇప్పుడు కృషి చేయండి అంటూ ఎమ్మెల్యేల‌కు ఆయ‌న తీవ్రస్థాయిలో హెచ్చరిక‌లు పంపారు. దీంతో ఒక్కసారిగా వైసీపీలో పెను సంచ‌ల‌నం రేగింది.

ఇంత హెచ్చరికలా?

అమ్మో మా నాయ‌కుడు ఇంత ఫైర్ అవుతాడ‌ని కానీ, ఇంత భారీ ల‌క్ష్యం మాపై మోపుతార‌ని కానీ మేం ఊ హించ‌లేదు. అంటూ నాయకులు, మంత్రులు కూడా ఒక్క దిక్కున అల్లాడిపోతున్నారు. కొంద‌రైతే.. ఇంతగా హెచ్చరిస్తే.. మేం ఏం చేయాలి ? అయినా గెలుపు ఓట‌ములు మా చేతిలో ఉంటాయా ? గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో చంద్రబాబు కూడా ఆ పార్టీ నాయ‌కుల‌ను ఇలానే బెదిరించారు. హెచ్చరించారు. ప్రజ‌లకు ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక తాయిలాలు ఇచ్చారు అయినా ఏం జ‌రిగింది. నినాదంగా ప‌ని చేయించుకోవాలే కానీ.. ఇలా హెచ్చరిస్తే.. కార్యక‌ర్తలు మా మాట ఎలా వింటారు? అని చెవులు కొరుక్కొంటున్నారు.

వత్తిడి పెంచడం వెనక?

అయితే, జ‌గ‌న్ వ్యూహం తెలిసిన వారి వాద‌న మ‌రోలా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయ‌కుల‌పై జ‌గ‌న్ ఇంత‌గా ఒత్తిడి పెంచ‌డం వెనుక పార్టీ శ్రేయ‌స్సే త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని అంటున్నారు. ప్రస్తుతం జ‌గ‌న్ ప్రభుత్వం ఏర్పడి ప‌దిమాసాలే అయింది., అయిన‌ప్పటికీ కూడా ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ స‌హా ఎలాంటి ప్రజాబ‌లం లేని కొన్ని పార్టీలు ఆయ‌న‌పైనా, ఆయ‌న విధానాల‌పైనా తీవ్రస్థాయిలో విమ‌ర్శలు చేస్తున్నాయి. చీటికీ మాటికీ కూడా కోర్టుల‌ను ఆశ్రయిస్తున్నాయి. కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న ప్రభుత్వం ఇప్పటి వ‌రకు అమ‌లు చేసిన ప‌థ‌కాలు, త‌న పాల‌న‌కు ప్రజ‌ల నుంచి తీసుకునే రిఫ‌రెండ‌మే ఈ ఎన్నిక‌లుగా భావిస్తున్నారు.

రెఫరెండంగానే భావించి…..

జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని విష‌యాల్లో వ్యతిరేక‌త ఉంది. ఇదే టైంలో ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి. జ‌న‌సేన .. బీజేపీతో జ‌ట్టు క‌ట్టింది. టీడీపీ నుంచి ఎటాక్ ఎక్కువైంది. అదే టైంలో కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి నిధులు అంద‌డం లేదు. ఈ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేయ‌డంతో ఆయా పార్టీల విమ‌ర్శల‌కు తాళం వేయ‌డంతోపాటు. త‌న ప్రజా సంక్షేమ కార్యక్రమాల వ్యూహాల‌కు మ‌రింత‌గా ప‌దును పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇలా కొంత ప్రెజ‌ర్ పెడుతున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News