స్ట్రాటజీని మార్చకుంటే?

ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం గీసుకున్న లక్ష్మణ రేఖ‌కు మ‌రో రెండు మాసాలు మాత్రమే గ‌డువు ఉంది. అంటే.. త‌ను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, సీఎంగా ప్రమాణ స‌మ‌యంలో [more]

Update: 2019-10-10 15:30 GMT

ఏపీలో జ‌గ‌న్ ప్రభుత్వం గీసుకున్న లక్ష్మణ రేఖ‌కు మ‌రో రెండు మాసాలు మాత్రమే గ‌డువు ఉంది. అంటే.. త‌ను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, సీఎంగా ప్రమాణ స‌మ‌యంలో త‌న పాల‌నను, త‌న‌ను క‌నీసం ఆరు మాసాల వ‌ర‌కు చూడాల‌ని, స‌మూల ప్రక్షాళ‌న చేసేందుకు త‌న‌కు క‌నీసం ఆరు మాసాలైనా స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరారు. దీనికి అప్పట్లో విమ‌ర్శకులు సైతం చ‌ప్పట్టు కొట్టారు. ఏ ప్రభుత్వానికైనా క‌నీసం ఆరు మాసాల గ‌డువు అనేది కీల‌క‌మ‌ని అనుకున్నారు. ఇక‌, ఇప్పుడు నాలుగు మాసాలు గ‌డిచి పోయాయి. మ‌రో రెండు నెల్ల‌లోనే జ‌గ‌న్ స‌త్తా ఏంటో ఏపీ ప్రజ‌ల‌కు తెలియ‌నుంది.

తెలంగాణ నుంచి…..

అదే స‌మ‌యంలో విప‌క్షాల‌కుకూడా భారీ ఎత్తున ప‌ని ఉంటుందా ? ఉండ‌దా ? అనే విష‌యం తెలిసిపో నుంది. అయితే, ఇప్పటి వ‌ర‌కు జ‌రిగిన పాల‌నను ఒక కోణంగా తీసుకుంటే.. మ‌రో కోణంలో కేవ‌లం రెండు నెల‌ల గ‌డువులో జ‌గ‌న్ క‌నీసం రెండు ప‌దుల ల‌క్ష్యాల‌నైనా సాధించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. వీటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మ‌న‌కు రావాల్సిన విద్యుత్ బ‌కాయిలు 5 వేల కోట్ల రూపాయ‌లు, అదే స‌మ‌యంలో విద్యుత్ ఉద్యోగుల విభ‌జ‌న‌లో నెల‌కొన్ని ప్రతిష్టంభ‌న‌ను తొల‌గించి సుహృధ్భావ వాతావ‌ర‌ణం ఏర్పడేలా చూడాలి.

అన్నింటికీ ఓకే….

ఇప్పటి వ‌ర‌కు చూసుకుంటే.. ఈ నాలుగు మాసాల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అన్ని విధాలా జ‌గ‌న్ స‌హ‌క‌రించార‌నేది కేసీఆర్ నోటి నుంచే మ‌నం విన్నాం. హైద‌రాబాద్‌లోని ఏపీ భ‌వ‌నాల‌ను ఏమీ ఆశించ‌కుండానే తెలంగాణ‌కు ఇచ్చేశారు. ఏపీ పోర్టుల్లో తెలంగాణా వ్యాపారాల‌కు సంబంధించి విష‌యాల‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అత్యంత కీల‌క‌మైన గోదావ‌రి జ‌లాల త‌ర‌లింపు పైనా కేసీఆర్‌తో జగన్ చ‌ర్చించారు. ఈ క్రమంలోనే ఏపీకి సంబంధించిన జ‌లాల‌ను అటు మ‌ళ్లించేందుకు తెలంగాణ భూభాగంలో క‌ట్టే ప్రాజెక్టుల‌కు కూడా ఏపీ సాయం చేసేందుకు ఓకే అనిపించారు.

విభజన హామీల అమలులో….

ఇక తాజాగా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో సైతం టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి వైసీపీ మ‌ద్దతు ప్ర‌క‌టించింది. ఇక్కడ కూడా జ‌గ‌న్ ప‌ట్ల కేసీఆర్ ఎంతో కృత‌జ్ఞతా భావంతో ఉన్నారు. అయితే, ఎటొచ్చీ.. ఏపీకి సంబంధించిన అనేక విష‌యాలు, విభ‌జ‌న చ‌ట్టంలోని కీల‌క అంశాల ప్రతిపాదనలు, ఉద్యోగుల విభ‌జ‌న బ‌కాయిలు వంటి విష‌యాల‌పై మాత్రం ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ సాధించింది ఏమీ క‌నిపించ‌లేదు.

కొన్నింటినైనా సాధిస్తే…..

వ‌చ్చే ఆరు మాసాల త‌ర్వాత త‌నకు మార్కులు వేయాల‌నేది జ‌గ‌న్ వ్యూహం అయిన‌ప్పుడు.. తెలంగాణ విష‌యంలో ఆయ‌న సాధించాల్సిన వాటి విష‌యం కూడా చ‌ర్చకు వ‌చ్చే అవ‌కాశం మెండుగానే క‌నిపిస్తోంది. మీరు తెలంగాణకు అన్నీ ఇచ్చారు.. స‌రే.. మ‌రి తెలంగాణ నుంచి ఏం సాధించారు? అనే ప్రశ్నకు జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల్సి రావొచ్చు. సో.. ఇప్పుడే మేల్కొని వ‌చ్చే రెండు మాసాల్లోనే తెలంగాణ నుంచి రావాల్సిన వాటిలో కొన్నింటినైనా సాధించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News