రీసౌండ్ ఇచ్చేలా రివర్స్ ఎటాక్ ఉండబోతుందటగా

ఉగాది అంటే కొత్త యుగానికి దారి. పాత రూట్ కి శుభం కార్డ్. తెలుగు వారికి కొత్త కాంతులు చూపించే ఉగాది నుంచి ఏపీలో రాజకీయం కూడా [more]

Update: 2020-03-01 02:00 GMT

ఉగాది అంటే కొత్త యుగానికి దారి. పాత రూట్ కి శుభం కార్డ్. తెలుగు వారికి కొత్త కాంతులు చూపించే ఉగాది నుంచి ఏపీలో రాజకీయం కూడా దారి మార్చుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఉగాది తో జగన్ని మరో రూపంలో జనం చూస్తారని అంటున్నారు. జగన్ కనుక పెదవి విప్పితే అవి ప్రకంపనలే. ఆయన నోరు తెరిస్తే ఆ గర్జన వేరేగా ఉంటుంది. ఉగాది నాటికి పదినెలల పాలనను పూర్తి చేసుకోనున్న జగన్ తన ఓల్డ్ స్టైల్ ని మిక్స్ చేస్తూ కొత్తగా కోటింగు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. మరి ఏపీలోని విపక్షాలు, ప్రత్యేకించి చంద్రబాబు కాసుకోవడానికి రెడీనా.

గుమ్మడి కాయ కొట్టేసి…

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సాఫ్ట్ గా కనిపించేందుకే ఎక్కువగా ట్రై చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ఆయన బయట మీటింగుల్లో మాట్లాడింది కూడా తన పధకాల ప్రారంభోత్సవాల్లోనే. అక్కడ కూడా ఆయన తన హామీలు, స్కీముల గురించి జనాలకు చెప్పేసి సభ ముగించేసేవారు. గత తొమ్మిది నెలల్లో జగన్ తాను ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేశారు. అన్నింటిలో అతి పెద్దది అయిన పేదలకు పాతిక లక్షల పట్టాల పంపిణీ అన్నది అతి ముఖ్యమైనది. ఇది రాజకీయంగా కూడా జగన్ ఇమేజ్ ని ఆకాశాన్ని ఎత్తేసేది. ఏపీలో పేదలకు ఇల్లు లేకుండా ఉండరాదని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సక్సెస్ అయితే జగన్ కి తిరుగులేనట్లే. అందువల్ల ఇళ్ళ పట్టాల పంపిణీతో హామీలన్నీ తీర్చేసి జగన్ గుమ్మడి కాయ కొట్టేస్తారు.

లోపలా అలాగే….

జగన్ ఇప్పటివ‌రకూ సీఎం హోదాలో సాఫ్ట్ గా కనిపించారు. ఆయన మాటలన్నీ కూడా చాలా వృదువుగా ఉన్నాయి. ఆవేశపరుడైన జగన్ ఇలా అయిపోయారేంటి అని అంతా అనుకున్నారు. మరో వైపు విపక్షాలు మాత్రం జగన్ ని ప్రతీ రోజూ తిడుతూనే ఉన్నాయి. చంద్రబాబు అయితే మాటలతో పెద్ద ఎత్తున ఎటాక్ చేస్తూనే ఉన్నారు. దానికి బదులుగా జగన్ తాను పైకి ఇపుడు సాఫ్ట్ గా కనిపిస్తున్నా తనలోని మాస్ అలాగే ఉందని విజయనగరం మీటింగులో చెప్పకనే చెప్పారు. ఆ మీటింగులో ఈ మధ్యకాలంలో తొలిసారిగా పాత జగన్ ని అంతా చూశారు. విపక్షాన్ని, మీడియాను కలిపి ఉన్మాదులు, రాక్షసులు అంటూ జగన్ చెడుగుడు ఆడేసారు. ఇక ఇదే స్పీడ్ తో జగన్ తన దూకుడు పెంచనున్నారట. ఉగాది దాటితే జగన్ రివర్స్ అటాక్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

ఇక రాజకీయమే….

జగన్ పాలనలో కొత్తదనాన్ని చూపించాలనుకుంటున్నారు. మూడు రాజధానులు అందులో భాగమే. ఇక సంక్షేమం కూడా పీక్స్ తీసుకుపోయారు. రానున్న నాలుగేళ్ళలో కొత్తగా ఏ హామీలు జగన్ ఇక ఇవ్వరు. పాత వాటినే క్రమబద్దీకరణ చేసుకుని ముందుకుపోతారు. అదే సమయంలో ఇటు పాలనతో పాటు రాజకీయాలపైన కూడా జగన్ మూడవ కన్ను తెరుస్తారు. బాబు ఒక మాట అంటే దానికి రీ సౌండ్ ఇచ్చేలా జగన్ అటాక్ ఉంటుందని వైసీపీ వర్గాల నుంచి వస్తున్న మాట. విపక్షంలో ఉన్నపుడే జగన్ చెలరేగిపోయారు. ఇపుడు చేతిలో అధికారం ఉంది. దాంతో ఆయన దూకుడు పెంచితే ఏపీలోని విపక్షం ఎదిరించి నిలబడడం కష్టమేనని అంటున్నారు. చూడాలి సమ్మర్ ని మించే ఈ పొలిటికల్ హీట్ ఎలా ఏపీని కమ్ముకుంటుందో.

Tags:    

Similar News