ఇప్పుడైనా ఓపెన్ అప్ అవ్వాల్సిందేగా?

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీకి కేంద్రంలో మంత్రి పదవులు అందుకు బదులుగా ఏపీ [more]

Update: 2020-02-28 13:30 GMT

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీకి కేంద్రంలో మంత్రి పదవులు అందుకు బదులుగా ఏపీ నుంచి బీజేపీకి ఒక రాజ్యసభ స్థానం ఇవ్వాలంటూ అగ్రిమెంటు కుదిరినట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ ప్రచారం మరింత పెరిగింది.

నాలుగు ఖాళీలవుతుండటంతో….

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలూ వైసీపీకే దక్కనున్నాయి. అంటే రాజ్యసభలో ఇప్పటికే ఉన్న ఇద్దరితో పాటు మరో నలుగురు చేరితే వైసీపీకి రాజ్యసభలో బలం ఆరుకు చేరుతుంది. అయితే రాజ్యసభలో తమను వివిధ బిల్లుల విషయంలో గట్టెక్కించేందుకు వైసీపీ సహకారాన్ని తీసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గంలో చేరాలన్న ప్రతిపాదన జగన్ ముందు ఉంచినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

బీజేపీకి ఒకటి….

అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానాలను జగన్ భర్తీ చేయాల్సి ఉంది. నాలుగు పోస్టులకు అనేక మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఒకరికి ఇప్పటికే జగన్ మాట ఇచ్చారని తెలుస్తోంది. పారిశ్రామిక వేత్త అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇస్తానని మాట ఇవ్వడంతో ఆయన పేరు దాదాపు ఖరారయినట్లే చెబుతున్నారు. ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు సభ్యులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మిగలిన మూడు స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇద్దరు బీసీలు….

ఇందులో ఇద్దరు బీసీలు ఉండే అవకాశముంది. ఒకటి మాత్రం బీజేపీ కోసం రిజర్వ్ చేసినట్లు చెబుతున్నారు. బీసీ నేతలుగా బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ పేర్లు విన్పిస్తున్నాయి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు కూడా బాగానే ప్రచారంలో ఉంది. జగన్ నిర్ణయానికే పార్టీ వదిలిసేనప్పటికీ మూడు సీట్లు మాత్రం ఇతర సామాజికవర్గాలకే కేటాయిచండం ఖాయం. అయితే ఈ ఎన్నికలతో బీజేపీ, వైసీపీ బంధం బయటపడే అవకాశం మాత్రం ఉంది. బీజేపీకి ఒక సీటు నిజంగా వదిలేస్తే అది రహస్య ఒప్పందమే అనుకోవాలి. లేకుంటే దానిని ప్రచారంగా కొట్టేయొచ్చు.

Tags:    

Similar News