రన్… జగన్…రన్

లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని [more]

Update: 2020-03-02 02:00 GMT

లోకల్ బాడీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎవరిపైనా ఆధారపడకుండా జగన్ ఆ జిల్లాల ఇన్ ఛార్జి మంత్రులకే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ప్రతి జిల్లాలోనూ మెజారిటీ స్థానాలను కైైవసం చేసుకోవాల్సిందేనని లైట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారంటున్నారు.

జిల్లా మంత్రులకే…..

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ పూర్తిగా జిల్లాలపైనే దృష్టి పెట్టాలన్న జగన్ ఆదేశాలతో మంత్రులు జిల్లాలకు పరుగులు తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు అత్యంత అవసరం. తాను తీసుకున్న నిర్ణయాలన్నింటికీ ప్రజామోదం ఉందని తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి. అది సాధ్యం కాకుంటే జగన్ నిర్ణయాలు ప్రజలు తప్పుపట్టారన్న విషయం స్పష్టమవుతుంది.

ఎన్నికల మేనేజ్ మెంట్ నుంచి…..

దీనికితోడు విపక్షాలకు కూడా స్పేస్ ఇచ్చినట్లవుతుంది. అయితే చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్లలేదు. దీనికి భిన్నంగా జగన్ మాత్రం ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించి ప్రజామోదం తమకే ఉందని చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఎన్నికల మేనేజ్ మెంట్ నుంచి ప్రచారం వరకూ అంతా జిల్లా ఇన్ ఛార్జి మంత్రులదేనని జగన్ తేల్చి చెప్పేశారు.

అక్కడే శాఖా పనులు….

దీంతో మంత్రులు ఇక జిల్లాలను వదిలి రావడం లేదు. శాఖల పనిని కూడా కొందరు మంత్రులు జిల్లాల్లోనే చక్క పెడుతున్నారు. ప్రధానంగా సామాజికవర్గంగా బేరీజు వేసుకుని ఆ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై మంత్రులు దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తమ పరువును కాపాడుకోవాలని కొందరు మంత్రులుంటే, మంత్రి పదవి కాపాడుకోవాలని మరికొందరు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరి ఇది నిజంగా మంత్రులకు జగన్ అగ్ని పరీక్ష పెట్టారనే చెప్పాలి.

Tags:    

Similar News